రాష్ట్రపతి భవన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలో అత్యున్నత కార్యక్రమాలు నిర్వహించే ప్రత్యేక స్థలం ఇది. ప్రధాని ప్రమాణ స్వీకారం, విదేశీ దేశాధినేతల సమావేశాలు, గౌరవ విందులు లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. కాగా నేడు (బుధవారం 12 ఫిబ్రవరి).. రాష్ట్రపతి భవన్ భద్రత విభాగంలో పీఎస్ఓ (Personal Security Officer) హోదాలో పని చేస్తున్న పూనమ్ గుప్తా వివాహం ఇక్కడ ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ఈ అవకాశం కల్పించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెస్సెజ్ లో 500 రూపాయల నోటును తీసుకోవద్దని, అందులో ఆకుపచ్చ స్ట్రిప్‌ను ఆర్‌బిఐ గవర్నర్ సంతకం దగ్గర కాకుండా గాంధీజీ చిత్రం దగ్గర ఉంచాలని పేర్కొంది. అయితే ఆ మెసేజ్ వైరల్ కావడంతో జనాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే ఎట్టకేలకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో ఈ విషయం పూర్తిగా ఫేక్ అని తేలింది.
కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది.. విద్యా వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపించింది.. చదువులను నాశనం చేసింది మహమ్మారి.. స్కూళ్లు, కాలేజీలు, యూవనిర్సిటీలు.. ఇలా విద్యాసంస్థలు అన్నీ మూతబడ్డాయి.. దాంతో, ఆన్‌లైన్ పాఠాలకే పరిమితం అయ్యారు విద్యార్థులు.. ఆన్‌లైన్ క్లాసుల పుణ్యమా? అని ప్రతీ విద్యార్థి చేతికి స్మార్ట్‌ఫోన్ వచ్చింది.. చదవువులు తక్కువ..! ఆన్‌లైన్ గేమ్‌లు ఎక్కువ అనే పరిస్థితి తీసుకొచ్చింది.. అయితే, మహమ్మారి తగ్గుముఖం పట్టి.. సాధారణ పరిస్థితులు వచ్చిన తర్వాత యథావిథిగా విద్యాసంస్థలు…
కరోనా సెకండ్ వేవ్ కంట్రోల్ చేయడానికి మరోసారి దేశ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తారంటూ వస్తున్నవార్తలు వైరల్ గా మారిపోయాయి.. లాక్‌డౌన్ బాధ్యత మాది కాదు.. కేసుల తీవ్రత, పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకుంటాయని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. అయినా ఈ వార్తలు ఆగడంలో.. దేశ వ్యాప్తంగా మే 3వ తేదీ నుంచి లాక్‌డౌన్ విధిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.. అయితే, దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్…