ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. మంత్రాల నెపంతో ఇద్దరు వ్యక్తులపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితులకు గాయాలు కావడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏప్రిల్ 15న
పెనుబల్లి మండలం పార్థసారథి పురం గ్రామంలో ఓ అమానుష ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: # 90s: బ్లాక్ బస్టర్ కాంబో మళ్ళీ వస్తోంది.. కానీ?
గ్రామానికి చెందిన కుంజా శివ అనే యువకుడు ఏప్రిల్ 2వ తారీఖున పాము కాటుతో మృతి చెందాడు. అతని పెద్దకర్మను సోమవారం(ఏప్రిల్ 15)న నిర్వహించారు. ఈ పెద్దకర్మకు కుల పెద్ద బండి రాములు, మరో దివ్యాంగుడిపై మృతుడి బంధువులు ఒక్కసారిగా దాడికి పడ్డారు. తమ తమ్ముడికి చేతబడి చేసి చంపేశారు అంటూ శివ అక్క పోతమ్మ రాములుపై తోటి కుటుంబ సభ్యులతో కలిసి దాడికి పాల్పడింది. పళ్లను పీకేందుకు కటింగ్ బ్లేర్‌తో ప్రయత్నించగా అక్కడే ఉన్న కొందరు కుల పెద్దల సహాయంతో రాములు తప్పించుకున్నారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వచ్చిన దివ్యాంగ యువకుడిపై సైతం మృతుడి బంధువులు చేతబడి నెపంతో దాడి చేశారు. యువకుడి చేతిలో నిప్పు రవ్వలు వేసి అమానుషంగా ప్రవర్తించారు. ఈ దాడిలో దివ్యాంగుడి చేతికి గాయాలయ్యాయి. మంగళవారం వీఎం.బంజర్ పోలీసులకు బాధితులు పిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: KCR: రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..