ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) స్పందించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని కేటీఆర్‌కు చెప్పామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పామని సిట్ అధికారి అధికారులు చెప్పారు. కేటీఆర్‌ను ఒంటరిగానే ప్రశ్నించాం అని.. ఆధారాలు, రికార్డులు ముందుంచి ప్రశ్నలు అడిగామన్నారు. నేటి విచారణ కేవలం క్రైమ్ నం.243/2024కే పరిమితం అని.. ఇది వేలాది మందిపై జరిగినట్టు ఆరోపణలున్న అక్రమ ఫోన్ నిఘా కేసు అని…