వారం క్రితం భారీగా తగ్గిన పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. హైదరాబాద్‌లో సోమవారం నాడు లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు పెరిగి రూ.109.83కి చేరింది. లీటర్ డీజిల్ 16 పైసలు పెరిగి రూ.97.98కి చేరింది. మరోవైపు ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి రూ.111.92గా నమోదైంది. లీటర్ డీజిల్ 9 పైసలు తగ్గి రూ.99.65కి చేరింది.
కాగా 10 రోజుల కిందట పెట్రోల్ ధరలు భారీగా పెరిగి లీటరు ధర రూ.120 దాటింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మరోసారి తగ్గించింది. ఈ మేరకు పెట్రోల్ ధరల్లో భారీ ఎత్తున ధరల్లో మార్పు కనిపించింది. పెట్రోల్ ధరలో రూ.9కి పైగా, డీజిల్ ధరలో రూ.7కి పైగా తగ్గింది. దీంతో కాస్త ఉపశమనం కలిగిందని సామాన్యులు భావిస్తున్నారు. అటు మే 30 నాటి ధరల ప్రకారం అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 116.04 డాలర్ల స్థాయిని చేరింది.