Periods Time Food: మహిళలకు పీరియడ్స్ సమయంలో అసౌకర్యానికి చెక్ పెట్టే పండ్ల జాబితా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Periods Time Food: స్త్రీలు నెలసరి సమయంలో సరైన పోషకాహారం తీసుకోవడం ఆరోగ్య పరంగా చాలా ముఖ్యం. ఆ రోజుల్లో శరీరంలో వచ్చే హార్మోన్ల మార్పులు అనేక రకాలుగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా రక్తస్రావం అధికంగా ఉండే సందర్భాల్లో శక్తినిచ్చే, రోగనిరోధకతను పెంచే ఆహారాన్ని తీసుకోవడం అవసరం. పండ్లు ఈ విషయంలో వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇవి సహజ శక్తిని అందించడంలో కీలకంగా పనిచేస్తాయి. మరి అవి ఏ పండ్లు..? వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలో ఒకసారి చూద్దాం..
* నెలసరి సమయంలో అరటి పండు తినడం చాలా ప్రయోజనకరం. ఇది పొటాషియం, విటమిన్ B6 లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరంలోని ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఇవి మూడ్ ను స్టేబిలైజ్ చేస్తాయి. ఇందులో ఉన్న కార్బోహైడ్రేట్లు శక్తిని పెంచుతాయి, నిస్సత్తువను తగ్గిస్తాయి.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
* స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు వంటి బెర్రీ పండ్లు యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరులు. ఇవి శరీరంలోని వాపులను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధక సమస్య కూడా నివారించగలవు.
* ముఖ్యంగా విటమిన్ C అధికంగా ఉండే నారింజ, ముసంబి వంటి పుల్ల పండ్లు శరీరంలో ఐరన్ శోషణకు సహకరిస్తాయి. పీరియడ్స్ సమయంలో హేమోగ్లోబిన్ స్థాయి తగ్గే ప్రమాదం ఉండడం వల్ల అలసట, బలహీనత కలుగుతుంది. అందుకే ఇవి తప్పనిసరిగా డైట్ లో ఉండాలి.
Read Also:Viral Video: అయ్యబాబోయ్.. బతికి ఉన్న బొద్దింకను అలా చేశావేంటి తల్లి.. వీడియో వైరల్
* పైనాపిల్లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇది కండరాల ఒత్తిడిని తగ్గించడంతో పాటు నెలసరి సమయంలో వచ్చే నొప్పులను ఉపశమన పరచుతుంది. జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.
* కివీలో విటమిన్ K, విటమిన్ E, ఫోలేట్ వంటి కీలక పోషకాలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. నెలసరి సమయంలో ఇది చక్కటి శక్తివంతమైన పండు.
వీటిని తీసుకోవడంతోపాటు ఆ సమయంలో వారు.. రోజంతా బాగా నీళ్లు తాగాలి. తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇంకా పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారం, పండ్లు తినాలి. మొత్తంగా.. రుతుక్రమ సమయంలో స్త్రీలు పౌష్టికతతో కూడిన పండ్లను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అటువంటి సహజమైన ఆహారం జీవితాంతం ఆరోగ్యాన్ని అందిస్తుంది.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?