Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yash Toxic Trailer: రాకింగ్ స్టార్ యశ్ హీరోగా డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ప్రస్తుతం ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ బయటికి వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, టీజర్, పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే తీవ్ర విమర్శలను అంతే స్థాయిలో ఎదుర్కొంటుంది. తాజాగా చిత్ర బృందం సినిమా అఫీషియల్ ట్రైలర్ గురించి ఫ్యాన్స్‌కి అదిరిపోయే అప్డేట్ను ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 8 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. అయితే అదే సమయంలో కొన్ని అంశాలపై సోషల్ మీడియాలో చర్చలు, విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. సినిమా విజువల్స్, యశ్ లుక్, కథా నేపథ్యం వంటి విషయాలపై అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ‘టాక్సిక్’ చిత్ర బృందం ఈ సినిమా అధికారిక ట్రైలర్ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించింది. ఆగస్టు 8వ తేదీన ‘టాక్సిక్’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటనతో యశ్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ట్రైలర్లో సినిమా కథ, యశ్ పాత్ర స్వభావం, గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన ప్రపంచం ఎలా ఉండబోతుందనే దానిపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యశ్ కెరీర్లో మరో భారీ ప్రాజెక్ట్‌గా నిలవనున్న ‘టాక్సిక్’పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!