Asmita Dey: తండ్రి చనిపోయి 7 నెలలు… కూతురు తెచ్చిన గోల్డ్ దేశాన్నే కదిలించింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asmita Dey: ఒక చిన్న మట్టి ఇల్లు… రోజంతా సైకిళ్లు బాగు చేస్తే వచ్చే మూడు వందల రూపాయలు… అంతే ఆ కుటుంబానికి ప్రపంచం. కానీ ఆ తండ్రి కళ్లలో మాత్రం తన కూతురి కోసం కోట్ల విలువ చేసే ఒక కల ఉండేది. ఆ కల పేరు అస్మితా దే. ఆ తండ్రి కూతురు మెడలో బంగారు పతకం చూడాలని జీవితమంతా పోరాడాడు. కానీ విధి మాత్రం ఆ రోజు వచ్చే వరకు అతన్ని బతకనివ్వలేదు.
త్రిపురలోని ఓ చిన్న గ్రామానికి చెందిన అస్మితా దే… కామన్వెల్త్ గేమ్స్ మహిళల 48 కిలోల జూడో విభాగంలో బంగారు పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో జూడోలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన క్రీడాకారిణిగా నిలిచింది. కానీ ఆ విజయాన్ని చెప్పాలని ఆమె ఎక్కువగా కోరుకున్న వ్యక్తి… ఈ లోకంలో లేడు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏడు నెలల క్రితం ఆమె తండ్రి బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించాడు. రోజుకు కేవలం మూడు వందల రూపాయలు సంపాదించే సైకిల్ మెకానిక్. అయినా తన కూతురి కలలకు ఎప్పుడూ పేదరికం అడ్డుగా నిలవనివ్వలేదు. మోకాలి గాయం వల్ల కెరీర్ ప్రమాదంలో పడినప్పుడు, తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. మందులు కొనిపెట్టాడు. తన కూతురు మళ్లీ జూడో మ్యాట్‌పై నిలబడాలని చివరి వరకు పోరాడాడు.
కానీ తండ్రి మరణంతో అస్మితా ప్రపంచమే కూలిపోయింది. తనకు అండగా నిలిచిన మనిషి లేకపోవడంతో తన కల కూడా ముగిసిపోయిందని అనుకుంది. అలాంటి సమయంలో తల్లి చెప్పిన ఒక్క మాట ఆమె జీవితాన్ని మళ్లీ నిలబెట్టింది. అంత్యక్రియలు జరిగిన పది రోజులకే… “నిన్ను ఈరోజు ఆపితే నీ నాన్న కలను నేనే చంపినట్టవుతుంది. మళ్లీ ప్రాక్టీస్‌కు వెళ్లు” అని ధైర్యం చెప్పింది.
ఆ మాటలతో అస్మితా భోపాల్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి తిరిగి వెళ్లింది. కామన్వెల్త్ గేమ్స్ దగ్గరపడే కొద్దీ ఆందోళన పెరిగింది. ఎన్నో రాత్రులు నిద్రపట్టలేదు. తెల్లవారుజామున ఐదున్నరకే లేచి సాధనకు వెళ్లేది. తమ్ముడు ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన ‘లౌంగ్ లట్టా’ అనే స్వీట్ ఫ్రిజ్‌లో కనిపించిన ప్రతిసారీ తినాలనిపించినా… లక్ష్యం గుర్తుకొచ్చి తన కోరికను అదుపు చేసుకుంది.
చివరకు ఆ త్యాగాలన్నీ ఒక్క బంగారు పతకంగా మారాయి. కామన్వెల్త్ గేమ్స్ వేదికపై స్వర్ణం గెలిచిన ఆ క్షణంలో… భారత జూడో చరిత్ర కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కానీ ఆ మెడల్ మెరుపు వెనుక కనిపించని మరో బంగారం ఉంది. అది ఒక పేద తండ్రి నమ్మకం… ఒక తల్లి ధైర్యం… ఒక కూతురు వదులుకోని కల. కొన్నిసార్లు చరిత్రను రాసేది డబ్బు కాదు… తల్లిదండ్రుల త్యాగం, పిల్లల పట్టుదల. అదే అస్మితా దే కథ.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..