Viral Video: ప్రతినిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల విషయాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాము. ఇందులో ఎక్కువగా ఫన్ క్రియేట్ చేసే వీడియోలు, అలాగే కొన్ని రకాలుగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. కొందరు ప్రజలు చేసే వింత పనుల వల్ల కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతుండడం ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాము. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చాలామంది బొద్దింకను చూడగానే అదేదో.. పులులను చూసినట్లుగా తెగ భయపడిపోతారు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Read Also:Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!
ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఘటన చూస్తే నోట మాట రాదు. ఎందుకంటే, ఓ మహిళ ఓ రెస్టారెంట్లో బర్గర్ తింటూ ఉంటుంది. అలా ఆమె ప్రశాంతగా కూర్చొని బర్గర్ తింటున్న సమయంలో ఆమె కూర్చున్న టేబుల్ పై బొద్దింక అటుగా పాకుతూ వెళ్తోంది. సరిగ్గా ఆమె తింటున్న ప్లేట్ పక్కకు వచ్చి ఆగిపోతుంది. అది గమనించిన సదరు మహిళ ఎటువంటి ఆలస్యం చేయకుండా ఆ బతికి ఉన్న బొద్దింకను ఓ చేత్తో పట్టుకొని దానిని ఆ బర్గర్ లో పెట్టింది. అంతటితో ఊరుకుందా అంటే లేదు. ఆ బర్గర్ ను ఏదో నాన్ వెజ్ బర్గర్ అనుకొని అమాంతం తినడం మొదలుపెట్టేసింది. ఈ వీడియోని చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read Also:Viral Post: ప్రజలను యాప్స్ నిలువు దోపిడీలు చేస్తున్నాయా..? ఇదిగో ప్రూఫ్..
ఓరి దేవుడా ఇటువంటి అమ్మాయిలు కూడా ఉన్నారా..? అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. మరి కొందరేమో ఇది మనకు కొత్తగా అనిపించవచ్చు.. కొన్ని దేశాల్లో ఇది కామన్ అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో నాకు ఈ వీడియో చూసిన వెంటనే వాంతులు అయ్యాయి అని కామెంట్ చేశారు. అయితే, ఈ వీడియో నిజంగా జరిగిందా..? లేదా ఎడిట్ చేసినదా..? అనేది స్పష్టంగా తెలియదు. కానీ నెటిజన్లని కలవరపెట్టడంలో మాత్రం ఈ క్లిప్ పూర్తి విజయవంతమైంది. కొంతమంది దీనిని గొప్ప పని చెబుతుంటే, మరికొంతమంది అసహ్యకరమైన చర్యగా పేర్కొంటున్నారు.