నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో నభూతో… నాభవిష్యత్… అనే విధంగా ఆరు వేల మందితో జరుగుతోంది ఈ ప్లీనరి సమావేశం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, 97 శాతం నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలకు ఆశలకు, వారి భద్రతకు అనుగుణంగానే తీర్మాణాలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
Also Read : Balesh Dhankar: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం
రూ. 2.కోట్లతో నర్సంపేట నియోజక వర్గ కేంద్రంగా కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ నిధిని బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి మరియు వారి పిల్లల భవిష్యత్ కోసమే వినియోగించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ నిధికి మొదటగా నా నెల జీతాన్ని కేటాయిస్తూ ప్రకటిస్తున్నాని ఆయన తెలిపారు. గత సంవత్సరం నష్టపోయిన రైతులకు రూ. 13 కోట్లను చెక్కుల రూపంలో అందించామని ఆయన పేర్కొన్నారు. ఈ సంవత్సరం అకాల వడగండ్ల వర్షంతో నష్టపోయిన 36 వేల మంది రైతులకు సుమారుగా రూ. 38 కోట్లను నష్టపరిహారంగా త్వరలో అందించనున్నామన్నారు. మాధన్నపేట చెరువు మిని ట్యాంకు బండ్ నిర్మాణం పూర్తి చేయనందుకు నియోజకవర్గ ప్రజలు క్షమించండని, అభివృద్ధి జీవో తెచ్చిన కొందరు కావాలని పనులకు ఆటంకం కలిగించారన్నారు.
Also Read : YS Viveka Case: దస్తగిరిని అలర్ట్ చేసిన సీబీఐ..! చిన్న అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వండి..!