Payments Bank Board: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు స్వతంత్రమైనది అని సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. అలాగే, పేటిఎం నియంత్రణ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఇక, అధికారికంగా వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL) అని చెప్పారు. అయితే, పేమెంట్స్ బ్యాంక్‌తో ఎలాంటి సంబంధం లేదు అని విజయ్ శేఖర్ శర్మ ఒక వెబ్‌నార్‌లో తెలిపారు.
Read Also: Dubai Flood: దుబాయ్ వరదలను అంతరిక్షం నుంచి చూస్తే.. ఫోటోలు రిలీజ్ చేసిన నాసా
అన్నింటిని చూసుకునే స్వతంత్ర బోర్డు ఉంది అని పేటిఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. బోర్డు సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జనవరి చివరలో పేటిఎం పేమెంట్స్ బ్యాంక్‌ని తన ఖాతాలలో లేదా డిజిటల్ వాలెట్లలో కొత్త డిపాజిట్లను స్వీకరించడాన్ని మార్చి నుంచి నిలిపివేయాలని ఆదేశించింది.. దీని వల్ల వినియోగదారులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు.. కానీ, ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనలను నిరంతరం పాటిస్తున్నట్లు విజయ్ శేఖర్ శర్మ ప్రకటించారు.
Read Also: Padma Bhushan Award: పద్మభూషణ్ అందుకున్న మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్
ఇక, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ యొక్క పేరెంట్ వన్ 97 కమ్యూనికేషన్స్, దాని డిజిటల్ చెల్లింపుల యాప్ కోసం ప్రసిద్ధి చెందింది. పేమెంట్స్ బ్యాంక్‌లో One97 49 శాతం కలిగి ఉండగా.. విజయ్ శేఖర్ శర్మ మిగిలిన 51 శాతాన్ని కలిగి ఉన్నారు. అయితే, ఫిబ్రవరిలో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించిన విజయ్ శర్మ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ నాన్- ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అండ్ బోర్డ్ మెంబర్ పదవికి రాజీనామా చేశారు.