నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి.. అధికార వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేందుకు కృషిచేస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించారు. ప్రగతి – పారదర్శకత – సుస్థిరత…