ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి.. అధికార వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించింది. సీఎంగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజలకు అందించేందుకు కృషిచేస్తున్నారు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వివరించారు. ప్రగతి – పారదర్శకత – సుస్థిరత…
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు.