బైజూస్ ట్యాబుల వ్యవహరంపై జనసే పార్టీ అధినేత పవన్ ట్వీట్ చేశారు. బైజూస్ సంస్థ నష్టాల్లో ఉందన్న కథనాలను ట్యాగ్ చేసిన పవన్.. పీఎంఓ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన ట్వీటుని ట్యాగ్ చేస్తూ కేంద్రం దృష్టి కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదు. టీచర్ రిక్రూట్‌మెంట్ లేదు.. టీచర్ ట్రైనింగ్ లేదు. నష్టాలు వచ్చే స్టార్టప్‌కి కోట్లలో కాంట్రాక్టులు వస్తాయి. వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్‌ను పాటించిందా..? ట్యాబు పంపిణీ కోసం ఎన్ని కంపెనీలు టెండర్లు దరఖాస్తు చేశాయి..? ఎవరు షార్ట్ లిస్ట్ చేశారు..? ఇది పబ్లిక్ డొమైన్‌లో ఉందా? వైసీపీ ప్రభుత్వం స్పందించాలి. ట్యాబ్‌లు మంచివే.. కానీ ముందుగా పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించండి. యాప్‌లు కన్నా.. ముందు ఉపాధ్యాయుడు తప్పని సరిగా ఉండేలా చూడండి.’ అని ట్విట్టస్త్రాలు సంధించారు పవన్ కల్యాణ్.
Also Read : Suguna Chicken: మొదట్లో రూ.5వేలతో ప్రారంభం.. నేడు రూ.12వేలకోట్ల టర్నోవర్
ఈ ట్వీట్ కు పలు మీడియా క్లిప్స్ ను కూడా జత చేశారు. వీటిలో స్టార్టప్ కంపెనీ బైజూస్ 2021లోనే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 17 రెట్లు నష్టాలు చవి చూసిందనే కథనం ఉంది. అలాగే బైజూస్ కు ట్యాబ్ ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ ఎంత చెల్లించిందనే వివరాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే వాలంటీర్ల వివాదంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ సర్కార్ పరువునష్టం దావా వేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మరో వ్యవస్ధ విద్యారంగంపైనా పవన్ చేసిన విమర్శలపై సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : IND vs BAN Fight: మూసుకుని పెవిలియన్‌కు పో.. భారత్, బంగ్లా ఆటగాళ్ల మధ్య గొడవ!