TS Election Holiday: ఉపాధ్యాయ సంఘం అభ్యర్థన మేరకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన ఆరు గ్యారంటీలు తనని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని జగదీశ్వర్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్లోని హాఫీజ్ పేట, ప్రేమ్ నగర్, మార్తాండ్ నగర్ లలో ఆయన ఇంటికి తిరుగుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు ఈ నెల 30న జరగనుండటంతో పోలింగ్‌కు ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తొలిసారి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు.