Groom Kidnapped: వివాహ వేడుకల్లో అప్పుడప్పుడూ అల్లర్లు, గొడవలు జరగడం సహజమే. కానీ, ఇటీవల పెళ్లిళ్లలో జరుగుతున్న కొన్నిచోట్ల విపరీతమైన సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంగీత్ ఈవెంట్స్‌లో గొడవలు, పెళ్లి ముహూర్తాన డిఫరెంట్ సీన్లు ఇలా ఎన్నో జరుగుతుంటాయి. ఇకపోతే, పెళ్లిలో వినోదం కోసం పిలిచిన డ్యాన్స్ బృందం.. చివరికి వరుడినే కిడ్నాప్ చేసిన ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే..
Read Also: Bride Calls Off Wedding: తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!
ఈ ఘటన బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా సాధు చౌక్ మొహల్లాలో గత రాత్రి (మే 24) రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. బైకుంఠపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిఘ్వా దుబౌలీ గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ కుమార్తె వివాహం జరుగుతోంది. వివాహోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు డ్యాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. బారాత్ ఆహ్వానానికి వీరిని పిలిచారు. మొదట వినోదంగా సాగిన వేడుక… స్థానిక యువకులతో డ్యాన్స్ టీమ్‌కు జరిగిన తగాదాతో క్రమంగా హింసాత్మకంగా మారింది.
ఈ గొడవ కారణంగా అగ్రహంతో డ్యాన్స్ బృందం నేరుగా వధువు ఇంటిలోకి చొరబడి, అక్కడ ఉన్న వారిపై దాడికి దిగింది. వధువు, ఆమె తల్లి విద్యావతి దేవితో పాటు పలువురు మహిళలను గాయపరిచారు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న ఆభరణాలు, ఖరీదైన వస్తువులు, వివాహానికి సిద్ధం చేసిన దుస్తులు దోచుకుని పారిపోయారు. అయితే ఆ ఘటనను చూసిన వరుడు దాడి చేసే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ, దాడి చేసినవారు అతనిపై కూడా దౌర్జన్యానికి దిగారు. తీవ్రంగా కొట్టి, బలవంతంగా వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు. వరుడిని ఎవరు తీసుకెళ్లారు? ఎందుకు ఇలా జరిగింది? అనే అనేక ప్రశ్నలు జవాబుల కోసం అక్కడి పెళ్ళివారు ఎదురుచూస్తున్నాయి.
Read Also: S**X On Road: బరితెగించిన రాజకీయ నేత.. రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్ గా శృంగారలీలలు..!
ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారైన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. వరుడిని సురక్షితంగా రప్పించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఘటన తెలుసుకున్న వధువు తీవ్ర షాక్‌కు గురై పదే పదే స్పృహ కోల్పోతుందని, ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇక్కడ ఇంకా ఒక కీలక అంశం ఏమంటే.. డ్యాన్స్ టీమ్‌లో ట్రాన్స్‌జెండర్ సభ్యులు ఉన్నట్లు సమాచారం. వారే ఈ గొడవకు కారణమయ్యారని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల దర్యాప్తుతో నిజాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.