జనసేన పార్టీ అధినేత తెలంగాణ జనసైనకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో క్షేత్ర స్థాయి సమస్యల మీద దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేసి జనసేన పార్టీ ఉనికిని చాటాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సమస్య తీవ్రత ఆధారంగా ఏ స్థాయిలో స్పందించాలని, ఏ స్థాయిలో పోరాటం చేయాలి అనే దిశగా అధ్యయనం చేయాలని తెలిపారు. ప్రతి సమస్యను జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మంగళవారం హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలకు చెందిన పార్టీ కో ఆర్డినేటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.
Also Read : Disha Patani: ఎద అందాలను ఎరగా వేసి ‘లోఫర్’ బ్యూటీ కవ్విస్తోందే
సంబంధిత నియోజక వర్గాల రాజకీయ, సామాజిక పరిస్థితులపై నివేదికను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అంశాల మీద కో ఆర్డినేటర్లకి ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రతి అంశంలో వీర మహిళలను, జన సైనికులను కలుపుకొని ముందుకు వెళ్లాలన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన నియోజకవర్గాల నాయకులతో కూడా సమావేశం అవుతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
Also Read : IPL 2023 : అక్షర్ పటేల్ దెబ్బ.. పెవిలియన్ కు సూర్యకుమార్ యాదవ్