హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మేజార్టీతో విజయం సాధించాలని కోరుతూ తిరుమలలోని జపాలి ఆంజనేయస్వామి ఆలయంలోని మెట్ల పై నుంచి పోర్లు దండాలు పెడుతూ మొక్కులు చెల్లించుకున్నారు పవన్ అభిమాని ఈశ్వర్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ వెలువడే ఎన్నికల ఫలితాల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటూ కోరుకున్నారు. ఇక, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిమాని ఈశ్వర్ తెలిపారు.