పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, సుకుమార్ లు పుష్ప 2తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఫార్మల్ అనౌన్స్మెంట్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సడన్ గా పుష్ప ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి కారణం సాయి పల్లవి. నెమలి నాట్యం చేసినట్లు తెరపై కదిలే సాయి పల్లవి పుష్ప 2 సినిమాలో ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తుందని టాక్ వినిపిస్తుంది. పది రోజుల కాల్ షీట్స్ ని సాయి పల్లవి కేటాయించిందని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఈ విషయంలో చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్ లేదు కానీ దాదాపుగా ఇది నిజమయ్యే అవకాశం ఉందని సమాచారం.
Read Also: SSMB 28: సెంటిమెంట్ తో టైటిల్ సెట్ చేస్తున్న మాటల మాంత్రికుడు
సాయి పల్లవి, అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్, రష్మిక, సునీల్… ఇలా కాస్ట్ పరంగా మోస్ట్ పుష్ప 2 సినిమా రోజుకి రోజుకి స్ట్రాంగ్ బజ్ ని జనరేట్ చేస్తోంది. ఇప్పుడున్న బజ్ ని మరింత పెంచడానికి మేకర్స్ ఒక ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. టిల్ డేట్ పుష్ప 2కి సంబంధించిన పోస్టర్ ని కూడా రిలీజ్ చెయ్యకుండా సీక్రెట్ గా షూటింగ్ చేస్తున్న సుకుమార్, అల్లు అర్జున్ పుట్టిన రోజున పుష్ప 2 ఫస్ట్ లుక్ తో పాటు, ఒక గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చెయ్యబోతున్నాడట. అంటే పుష్ప 2 సినిమా ప్రమోషన్స్ ఏప్రిల్ 8 నుంచి మొదలవుతాయన్నమాట. మరి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ గ్లిమ్ప్స్ తో పుష్ప రాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.