వాలంటీర్ల డేటా సేకరణపై మరో సారి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ట్విట్ చేశారు. జగన్ ప్రతిపక్షంలో ఉండగా డేటా సేకరణపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్ల వీడియోను ట్వీట్ చేశారు పవన్. ఈ సందర్భంగా పవన్.. వాలంటీర్లు సేకరిస్తోన్న డేటా ఎక్కడికెళ్తోందనేదే అందరి ఆందోళన. ఎవరు సీఎంగా ఉన్నా.. డేటా గోప్యతా చట్టాలు అలాగే ఉంటాయి. వాలంటీర్ల బాస్ ఎవరు? ఏపీ ప్రజల వ్యక్తిగత డేటాను ప్రభుత్వం ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు ప్రజల వ్యక్తిగత డేటాను సేకరించేందుకు వాలంటీర్లకు ఎవరు అధికారం ఇచ్చారు..? మూడు ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.’ అని ట్విట్టస్త్రాలు సంధించారు పవన్ కల్యాణ్.
Also Read : Covid 19: చైనా తర్వాత ఇప్పుడు అమెరికా.. కోవిడ్ లాంటి మహమ్మారి వస్తోందని హెచ్చరిక
ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. పవన్ ఢిల్లీలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొని.. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా లను కలసి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
Also Read : Ahmedabad airport: అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులోకి వరద నీరు..