టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. 3 టీ20ల సిరీస్ ఆడేందుకు ఐర్లాండ్ వెళ్లిన పాకిస్థాన్ శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. పాక్ నిర్దేశించిన 183 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐర్లాండ్ ఓపెనర్ ఆండ్రూ బల్బర్నీ 77 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దింతో ఐర్లాండ్ టీం చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
Also Read: Gautam Gambhir: అలాంటి ఓనర్ ఉండటం నా అదృష్టం: గంభీర్
అయితే ఈ మ్యాచ్ తర్వాత ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ పాక్ జట్టు పరువు తీసేలా మాట్లాడాడు. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించడమే కాకుండా, మ్యాచ్ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పుడు స్టెర్లింగ్ కు ఏమి మాట్లాడన్న విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యంత ఫ్లాట్ పిచ్‌లు ఉన్న పాకిస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారంటే.. ఆడేటప్పుడు.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మీకు అర్థం అవుతుంది. మీరు ఏ మాత్రం ఆడగలరో అంటూ పాక్ టీమ్ పరువు తీసాడు.
Also Read: IPL 2024: రికార్డ్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 17వ సీజన్..
పాకిస్థాన్‌లోని ఫీల్డ్‌లు పిచ్‌లు ప్లాట్‌గా ఉండటంతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయని.. అయితే, ఐర్లాండ్‌లో ఇలా కాదు. ఇక్కడి మైదానాలు బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. బౌన్స్, మరింత స్వింగ్ ఇక్కడ లభిస్తాయి. ఇక్కడి పిచ్‌లపై ఆడితే బ్యాటర్ల అసలు సత్తా ఏంటో బయటపడుతుందని అతని ఉద్దేశం. అయితే విజయం తర్వాత చెప్పడం ఇంకా హైలైట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే ఓటమితో కొట్టుమిట్టాడుతున్న పాక్ జట్టుకు స్టిర్లింగ్ వ్యాఖ్యలతో తల ఎక్కడ పెట్టుకొవాలో అర్థమవట్లేదు.
Paul Stirling said, "when you come here, especially from Pakistan, the flattest pitches in the world, ask them to bat first and see what they can get. We were happy to chase 180".
What's your take on this 🤔#IREvPAK #CSKvsGT #PAKvIRE pic.twitter.com/jldirmR2Ks
— Richard Kettleborough (@RichKettle07) May 11, 2024