Hima Varsha Reddy : శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో అలూరు నియోజకవర్గం అంటే తెలియని వారుండరు. కర్నూలు జిల్లాలోని ఈ ఆలూరు నియోజకవర్గంతో ఓ కుటుంబానికి విడదీయరాని బంధం ఉంది. ప్రజలే శ్వాసగా ఆ కుటుంబం బతుకుతుంది. ఆ కుటుంబానికి మట్టి వాసన తెలుసు. ప్రజల నాడీ తెలుసు. అలానే.. ప్రజల సమస్యలను తమ సొంత సమస్యగా భావించి ముందుకు కదలడం తెలుసు. ఆ కుటుంబమే పాటిల్ శేషా రెడ్డి – నీరజా రెడ్డి కుటుంబం. పాటిల్ శేషా రెడ్డి మంచి విద్యావేత్త, గోల్డ్ మెడలిస్ట్. ప్రజలకు సేవా చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా అలుపెరగని సేవ చేశారు. కానీ.. ఫ్యాక్షన్ గొడవల్లో 1996లో హత్యకు గురయ్యారు. భర్త లేరనే బాధను గుండె లోతుల్లోనే దాచుకుని ఆలూరు నియోజకవర్గ ప్రజల కోసం ముందడుగు వేశారు పాటిల్ నీరజా రెడ్డి. భర్త మరణం తరువాత నియోజకవర్గ ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకుంటూ వచ్చారు. 2004 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా.. మొక్కవోని ధైర్యంతో ప్రజల మధ్యనే ఉంటూ వారి కోసం పోరాడారు. పాటిల్ నీరజారెడ్డికి ప్రజల్లో ఉన్న అభిమానం చూసిన మహానేత వైఎస్ఆర్ ఆమెను రాజకీయాల్లో ప్రోత్సహించారు.
2009లో పిలిచి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈ ఎన్నికలో పాటిల్ నీరజా రెడ్డి బంపర్ మెజార్టీతో గెలిచారు. భర్త ఆశయాల సాధన కోసం అలుపెరగకుండా పని చేశారు. ప్రజాసేవే శ్వాసగా రాజకీయం చేశారు. నియోజకవర్గ ప్రజల ఇంటి బిడ్డగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ.. దురదృష్టం వెంటాడింది. కాలయముడు కాటేశాడు. ఏప్రిల్ 16, 2023న భర్త పాటిల్ శేషా రెడ్డి వర్ధంతి కోసం హైదరాబాద్ నుంచి కర్నూలు బయల్దేరారు నీరజారెడ్డి. తెలంగాణలోని బాచుపల్లి దగ్గర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. పాటిల్ నీరజా రెడ్డి మంచి విద్యావేత్తల కటుంబం నుంచి వచ్చారు. ఈమె తండ్రి జస్టిస్ రామ చెన్నారెడ్డి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి వాసి.
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
నీరజా రెడ్డి తండ్రి న్యాయ నిపుణుడు, విద్యావేత్త . 1988లో కర్నూలు జిల్లా తెర్నెకల్ గ్రామానికి చెందిన సోమిరెడ్డి చిన్న కుమారుడు శేషా రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. శేషా రెడ్డి అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్. భర్త చనిపోక ముందు, భర్త చనిపోయిన తరువాత భర్త అడుగుజాడల్లోనే నడిచి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయే వరకూ ప్రజాసేవలోనే గడిపారు పాటిల్ నీరజా రెడ్డి. తల్లితండ్రుల ఆశయాలను, తమ కుటుంబ వారసత్వాన్ని తన భుజాలకెత్తుకున్నారు పాటిల్ శేషా రెడ్డి – నీరజారెడ్డిల తనయ హిమ వర్షారెడ్డి. అమ్మ వైపు కుటుంబం నుంచి ఉన్నత విద్య వారసత్వం – తండ్రి వైపు కుటుంబం నుంచి ఉన్న రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్నారు హిమ వర్షా రెడ్డి.
ప్రజాసేవలో తల్లితండ్రుల వారసత్వాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని వివాహం చేసుకుని అమెరికాలో ఉంటూ పలు వ్యాపారాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆమె మనసు, శ్వాస, ఆలోచన అంతా ఆలూరు నియోజకవర్గంలోనే.. ఆలూరు అంటే హిమ వర్షా రెడ్డికి ప్రేమ కాదు ప్రాణం. తండ్రి ఆలోచనలను – అమ్మ ఆశయాలను బతికించడానికి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు హిమ వర్షా రెడ్డి. పుట్టిన తరువాత తండ్రి చేతుల్లో ఆడుకునే భాగ్యం ఆ దేవుడు ఇవ్వలేదు. హిమ వర్షారెడ్డికి నాలుగేళ్ల వయసులోనే తండ్రి హత్యకు గురయ్యారు. మరోవైపు…అన్నీ తానై నడిపించిన తల్లి చనిపోయిందనే పుట్టెడు దుఖః.. కళ్ల నుంచి సునామీలా తన్నుకొచ్చే కన్నీరు. కానీ… ఆమె ఆలోచనల ముందు, ప్రజలకు సేవ చేయాలనే తపన ముందు ఆ కన్నీరు కంటి పొరలమాటునే ఇంకిపోతోంది. గుండెలో అగ్ని గోళాలు బద్దలవుతోన్నా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే దృఢమైన నిర్ణయం తీసుకున్నారు పాటిల్ శేషా రెడ్డి – నీరజా రెడ్డిల గారాల పట్టి హిమ వర్షా రెడ్డి. తల్లిదండ్రుల ఆశయాల సాధన కోసం ప్రజల ముందుకు రావాలి అనుకుంటున్న హిమ వర్షా రెడ్డిని ప్రజలు ఆశీర్వదించే సమయం వచ్చేసింది. శేషా రెడ్డి – నీరజా రెడ్డిల మాటే హిమ వర్షా రెడ్డి బాట.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!