Pat Cummins: ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై 110 పరుగుల భారీ విజయం సాధించి సీజన్ ను ఘనంగా ముగించారు. అయితే, ప్లేఆఫ్ బరిలో నిలబడలేకపోవడంపై జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ విచారం వ్యక్తం చేశారు. మా వద్ద ఆడగలిగే సత్తా ఉంది.. కానీ, కొన్ని సందర్భాల్లో ఆడలేకపోయాం. ఇది మా ఏడాది కాదేమో అంటూ మ్యాచ్ అనంతరం కామెంట్ చేశారు.
Read Also: Pawan Kalyan: ప్రధాని మోడీ ఓట్లు కోసం చూడరు.. దేశ అభివృద్ధి కోసమే యోచిస్తారు!
ఇంకా కెప్టెన్ పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. సీజన్ చివరలో గొప్పగా ముగించాం. చివరి కొన్ని మ్యాచ్‌లలో బాగా ఆడాం. కానీ కొన్ని భాగాల్లో మాత్రం చాలా ఘోరంగా ఆడామని అనిపించింది. మా జట్టు ఫైనల్‌కు అర్హత ఉన్న జట్లలో ఒకటి, కానీ ఈసారి ఆ పనిచేయలేదు అంటూ కామెంట్స్ చేసాడు కమిన్స్. అలాగే ఈ తరహా పిచ్‌లపై మాకున్న సత్తాతో ఆడగలిగాం. కానీ కొన్ని మ్యాచ్‌లలో 170 పరుగులు చేయాల్సినప్పుడు మేము ఆడలేకపోయాము. జట్టులోని చాలా మందికి అవకాశాలు ఇచ్చాం. గాయాల వల్ల కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. మొత్తంగా 20 మంది ఆటగాళ్లను ఉపయోగించాం అని కమిన్స్ వివరించారు.
నిజానికి ఈ సీజన్‌ను SRH జట్టు చాలా అద్భుతంగా ప్రారంభించింది. మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల భారీ స్కోరు చేసింది. చివరి మ్యాచ్‌లోనూ 278 పరుగులతో ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక స్కోరు నమోదుచేసింది. కానీ, మధ్యలో ఊహించలేని ఘోరమైన ప్రదర్శన కారణంగా ప్లేఆఫ్ అవకాశాలు దూరమయ్యాయి. మొత్తంగా 6వ స్థానంలో సీజన్ ను ముగించింది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ KKR తమ సీజన్‌ను ఘోరంగా ముగించింది. 14 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. SRH ఇచ్చిన 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో కేవలం 168 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ అజింక్యా రహానే మాట్లాడుతూ.. SRH బ్యాట్స్‌మెన్స్ అద్భుతంగా ఆడారు. మా బౌలింగ్ యూనిట్ చాలా పొరపాట్లు చేసింది. మేము కొన్ని స్ట్రాటజీలు పెట్టుకున్నాం. కానీ, బౌలర్లు వాటిని అమలు చేయలేకపోయారు. ముఖ్యంగా క్లాసెన్ లాంటి బ్యాట్స్‌మెన్ ఎదుట అది పెద్ద సమస్యగా మారింది అని అన్నాడు.
ఇక సీజన్ మొత్తం చూసుకుంటే.. మాకు కొన్ని అవకాశాలు వచ్చాయి. 2-3 మ్యాచ్‌లను మేమే చేజార్చుకున్నాం. అలాంటి మ్యాచ్‌లు గెలిచి ఉంటే టేబుల్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉండే అవకాశం ఉండేది. అయినా మా ప్రయత్నం మాత్రం పూర్తిగా చేశాం. ఈ సీజన్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వచ్చే ఏడాది బలంగా తిరిగొస్తాం అని రహానే భవిష్యత్తుపై నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తంగా చెప్పాలంటే, SRH గొప్ప గెలుపుతో ముగించినా.. ప్లేఆఫ్ చేరలేకపోయారు. KKR మాత్రం టైటిల్ డిఫెన్స్‌లో పూర్తిగా విఫలమైంది.