Neeraj Chopra Said I gave my best in Paris Olympics 2024: భారతదేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉందని బల్లెం వీరుడు నీరజ్ చోప్రా తెలిపాడు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉందని, ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడన్నాడు. ఇది అర్షద్ నదీమ్ డే అని, తాను మాత్రం వందశాతం కష్టపడ్డా అని నీరజ్ చెప్పాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రా (89.45 మీటర్లు) సిల్వర్ మెడల్‌ను సాధించాడు. ఫైనల్‌లో పాకిస్థాన్ జావెలిన్ త్రో ప్లేయర్ అర్షద్ నదీమ్ (92.97 మీటర్లు) స్వర్ణం సాధించాడు.
Also Read: Neeraj Chopra Mother: గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డే: నీరజ్ చోప్రా తల్లి
నీరజ్ చోప్రా మాట్లాడుతూ… ‘దేశానికి పతకం సాధించినప్పుడల్లా మేమంతా చాలా సంతోషంగా ఉంటాం. నా ప్రదర్శనను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉంది. తప్పకుండా దీనిపై మేం కూర్చొని మాట్లాడుకుంటాం. పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేశారు. జావెలిన్ త్రో ఈవెంట్‌లో చాలా పోటీ ఉంది. ప్రతి అథ్లెట్ తనదైన రోజున సత్తా చాటుతాడు. ఇది అర్షద్ నదీమ్ డే. నేను నా బెస్ట్ ఇచ్చాను. మన జాతీయ గీతం వినిపించలేకపోయినందుకు బాధగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో జాతీయ గీతం వినిపిస్తా’ అని చెప్పాడు.
#WATCH | Paris: On winning a silver medal in men’s javelin throw at #ParisOlympics2024, Ace javelin thrower Neeraj Chopra says, “We all feel happy whenever we win a medal for the country…It’s time to improve the game now…We will sit and discuss and improve the… pic.twitter.com/kn6DNHBBnW
— ANI (@ANI) August 9, 2024