Neeraj Chopra Mother: గోల్డ్ మెడల్ సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డే: నీరజ్ చోప్రా తల్లి
- సిల్వర్ మెడల్‌ను సాధించిన నీరజ్
- హర్యానాలో సంబరాలు
- ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iam happy with Silver Medal in Paris Olympics 2024 Says Neeraj Chopra Mother: పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్ అథ్లెట్ హర్షద్ నదీమ్ స్వర్ణం సాధించాడు. అర్షద్ ఈటెను 92.97 మీటర్లు విసిరాడు. భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా ఈటెను 89.45 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్‌ను సాధించాడు. నీరజ్ సిల్వర్ మెడల్ సాధించడంతో హర్యానాలోని తన ఇంటి దగ్గర సంబరాలు మిన్నంటాయి. నీరజ్ కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుని పండగ చేసుకున్నారు. నీరజ్ తల్లి సరోజ్ దేవి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అందరి మనసులు గెలుచుకున్నారు.
బంగారు పతకం సాధించిన పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కూడా తన కుమారుడి లాంటివాడే అని నీరజ్ చోప్రా తల్లి సరోజ్ దేవి పేర్కొన్నారు. ‘నా కుమారుడు నీరజ్ చోప్రా రజత పతకం సాధించడం చాలా ఆనందంగా ఉంది. గోల్డ్ మెడల్ కంటే కూడా ఎంతో విలువైంది. బంగారు పతకం సాధించిన అర్షద్ నదీమ్ కూడా నా బిడ్డ లాంటివాడే. నీరజ్ ప్రదర్శనపట్ల గర్వంగా ఉంది. ఇంటికి వచ్చాక అతడికి ఇష్టమైన ఆహారాన్ని వండిపెడతా’ అని సరోజ్ దేవి చెప్పుకొచ్చారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
Also Read: Neeraj Chopra: నీరజ్ చోప్రా భారత్‌ను గర్వించేలా చేశాడు.. ప్రధాని మోడీ ప్రశంసలు!
నీరజ్ చోప్రా తండ్రి సతీశ్ మాట్లాడుతూ… ‘నీరజ్ దేశం కోసం సిల్వర్ మెడల్ గెలిచాడు. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతో గర్వంగా భావిస్తున్నాం. నీరజ్ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. గాయం తీవ్రత కూడా అతడి ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపించి ఉండొచ్చు. గాయం లేకపోతే మెరుగైన ప్రదర్శన చేసేవాడు’ అని చెప్పారు. కామన్‌వెల్త్ గేమ్స్‌కు ముందు గాయం కారణంగా నీరజ్ దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తీవ్రంగా శ్రమించి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగాడు.
Neeraj Chopra’s mother says “ I am happy with the silver, the guy who got gold ( Arshad Nadeem) is also my child, everyone goes there after doing a lot of hard work”
what grace from Neeraj Chopra’s mother, something that people can learn a lot from ♥️
Most beautiful video on… pic.twitter.com/Uqz3LQZCv7
— Roshan Rai (@RoshanKrRaii) August 8, 2024
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి