ఈమధ్యకాలంలో చిన్నచిన్న విషయాలకు పిల్లలు దారుణాలకు పాల్పడుతున్నారు. సెల్ ఫోన్ వాడొద్దన్నారని, సినిమాకు వెళ్లొద్దన్నారని.. ఇలా చిన్న చిన్న విషయాలకు ఆవేశాలకు లోనవుతున్నారు. తల్లిదండ్రులు స్కూల్ కి వెళ్ళద్దని అన్నారని ఆరో తరగతి చదువుతున్న ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం చిన్న తండాలో చోటుచేసుకుంది. ఈ బాలిక రాజంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంది.
Read Also: Nitya Menon: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యామీనన్..
దీపావళి సెలవుల నేపథ్యంలో ఆ బాలిక ఇంటికి వచ్చింది. సెలవులు ముగియడంతో పరీక్షలు ఉన్నాయి స్కూలుకు వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పింది. ఇంట్లో బంధువులు వచ్చారని తర్వాత వెళ్ళవచ్చు అని తల్లిదండ్రులు చెప్పారు. తల్లిదండ్రులు మందలించారని మనస్థాపం చెందిన బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బాలిక మృతితో చిన్నతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న విషయానికే కూతురు ఈ దారుణానికి ఒడిగట్టడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Read Also: PM Modi: కింద పోలీస్ స్టేషన్ పైన ఇళ్లు మోదీ సార్ ప్లాన్ అదుర్స్