మణిపూర్‌లో జరిగిన హింస సందర్భంగా భద్రతా దళాల నుంచి ఆయుధాలను ఎత్తుకెళ్లిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హింస సందర్భంగా ఆయుధాలు తీసుకెళ్లి ఇప్పటి వరకు అప్పగించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి హెచ్చరించారు.