Pakistani YouTuber: అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నా ఇంకా కొందరు మత ఛాందసవాదులు వారి చదువుపై అభ్యంతరం చెప్పుకొస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ లో ఓ యూట్యూబర్ బాలికలను స్కూళ్లకు పంపడాన్ని తప్పుబడుతూ ఏకంగా ఓ వీడియోతో కూడిన పాటను విడుదల చేశారు. హఫీజ్ హసన్ ఇక్బాల్ ఛిస్తీ అనే యూట్యూబర్ తన పాటకు ‘అప్నీ దీ స్కూలో హాతా లే ఓథీ డ్యాన్స్ కర్దీ పాయీ ఆయీ’ అనే నామకరణం పేరు పెట్టాడు. ‘మీ అమ్మాయి బడిలో డ్యాన్స్ చేస్తున్నందన ఆమెను పాఠశాల మాన్పించండి’ అనేది ఆ పాట యొక్క సారాంశం. ఇస్లాం మతాచారం ప్రకారం అమ్మాయిలు డ్యాన్సులు చేయడం అంగీకారయోగ్యం కాదని చెప్పుకొచ్చాడు. పాఠశాలలకు బాలికలు వెళ్లడం వల్ల పవిత్రత, గౌరవం కోల్పోతారని పేర్కొన్నాడు. యునెస్కో సూచనతో పాకిస్తాన్ లోని ఓ స్కూల్ బాలికలకు డ్యాన్స్ పోటీ నిర్వహించినట్లు ఓ వార్తా సంస్థ చూపించడంతో ఈ సాంగ్ స్టార్ట్ అవుతుంది. అందుకు ప్రతిగానే ఈ పాటను జూన్ లో రూపొందించినట్లు సదరు యూట్యూబర్ హఫీజ్ హసన్ ఇక్బాల్ ఛిస్తీ పేర్కొన్నాడు.
Read Also: Indian2 Effect : భారతీయుడు -2 దెబ్బకు అబ్బా అంటున్న తారక్, చరణ్ ఫాన్స్..?
అయితే, అతను స్వరపరిచిన ఆ పాటలోని సాహిత్యం కూడా తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో.. తమ ఇళ్లలోని అమ్మాయిలను వేశ్యలుగా మార్చాలనుకొనే వారు తప్ప ఎవరూ బడికి పంపొద్దని సూచించేలా పాట పాడాడు. ఈ వీడియోకు సుమారు 3 లక్షల వ్యూస్, 3 వేలకుపైగా లైక్ లు రావడంతో పాకిస్తాన్ లో మతఛాందసవాదం ఎంత గట్టిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.. మరోవైపు ఈ వీడియోపై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పాకిస్థాన్ ఎటు వైపు వెళ్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మానసిక రుగ్మతలతో పాక్ ఇంకా బాధ పడుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని నెటిజన్స్ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి మద్దతిస్తున్న వ్యక్తులు వారి ఆడ పిల్లల గురించి దేశం గురించి ఆలోచించుకోవాలంటూ మరో యూజర్ కామెంట్స్ పెట్టారు. పాక్ లో 75 శాతం మంది ఇలాంటి అతివాద మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉన్నారు.. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే పాకిస్థాన్ ఇంకా అభివృద్ది చెందలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.