Nepal: నేపాల్ కరెన్సీపై భారత ప్రాంతాలు.. ముద్రించనున్న చైనా..
- నేపాల్ దుందుడుకు చర్య..
- భారత భూగాలను తమవిగా చెప్పుకునే ప్రయత్నం..
- ఆ దేశ కరెన్సీపై భారత్‌కి చెందిన మూడు ప్రాంతాలు..
- కరెన్సీని ముద్రించనున్న చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal: నేపాల్ తన కరెన్సీ నోట్లపై భారత భూభాగాలను ముద్రించడం ద్వారా మన దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది. ఆ దేశ కరెన్సీని చైనా ముద్రించడం గమనార్హం. భారతదేశ భూభాగాలైన లింపియాధుర, లిపులేక్, కాలాపానీ ప్రాంతాలను తమ భాగాలుగా నేపాల్ చూపించుకునే ప్రయత్నం చేసింది. నేపాల్ సెంట్రల్ బ్యాంక్ అయిన నేపాల్ రాష్ట్ర బ్యాంక్ కొత్త 100 రూపాలయ నోట్లపై భారత భూభాగాలను ముద్రించింది. ఈ కాంట్రాక్టును చైనా కంపెనీకి ఇచ్చింది.
Read Also: KA Movie Review: క సినిమా రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా?
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
భారతదేశానికి అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన ఈ మూడు ప్రాంతాలను నేపాల్ తమవిగా చెప్పుకుంటోంది. దీనిపై గతంతో పెద్ద వివాదమే నడిచింది. జూన్ 18, 2020లో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను తమ భూభాగాలుగా చెబుతూ.. ఆ దేశం రాజ్యాంగాన్ని సవరించింది. ఈ చర్యలను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. మరోసారి వీటిని నేపాల్ దాని కరెన్సీ నోట్లపై ముద్రించడం ద్వారా మరోసారి వివాదాన్ని రాజేసింది. ప్రస్తుతం ఈ మూడు భాగాలు కూడా భారతదేశ ఆధ్వర్యంలోనే ఉన్నాయి.
చైనా బ్యాంక్ నోట్ ప్రింటింగ్, మింటింగ్ కార్పొరేషన్ ఈ నేపాల్ నోట్ల ముద్రణ కాంట్రాక్ట్‌ని పొందింది. 300 మిలియన్ నేపాల్ రూపాలయ విలువైన రూ. 100 నోట్ల డిజైన్‌ని ప్రింట్ చేసి డెలివరీ చేయాల్సిందిగా చైనా కంపెనీని కోరింది. దీని ప్రింటింగ్ ఖర్చు సుమారు 8.99 మిలియన్ డాలర్లుగా ఉంటుందని రిపబ్లికా పేపర్ నివేదించింది. నేపాల్ భారతదేశంలోని ఐదు రాష్ట్రాలైన సిక్కిం, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో 1850 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది.
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!