గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు నియమితులపైన విషయం తెలిసిందే. నేడు ఆయనను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. గోవా గవర్నర్ గా నియామకంపై అశోక్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ గజపతి రాజు మాట్లాడారు. ఈ నెల 26న గోవా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి గోవా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని వెల్లడించారు.. ఈ నెల 21న ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టుకుందాం అన్నారని.. కానీ మన తెలుగు వాళ్ళకి ఒక మంచి ముహూర్తంలో కార్యక్రమం చేపట్టడం ఆచారంగా వస్తుందని తెలిపారు. కావున శ్రావణ మాసంలో ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం అని తెలియజేసినట్లు స్పష్టం చేశారు. అదే విషయం రాజ్ భవన్ కు, కేంద్ర హోం శాఖకు కూడా తెలియజేశానన్నారు. వారు కూడా శ్రావణ మాసంలోనే పెట్టుకోమన్నారని.. కావున ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయడానికి సన్నద్ధ మవుతున్నట్లు చెప్పారు.
READ MORE: Chhattisgarh: నారాయణాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్, ఆరుగురు మావోయిస్టులు మృతి..
కాగా.. నేడు పూసపాటి అశోక్ గజపతి రాజు టీడీపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందని పూసపాటి అశోక్ గజపతి రాజు భావోద్వేగానికి గురయ్యారు. పసుపు రంగు పవిత్రతకు ప్రతిరూపమని ఆ పవిత్రతను కాపాడేలా పనిచేస్తానని చెప్పారు. రాజీనామా విషయం ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడి ఆమోదం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతకుముందు కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆయన రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు.
READ MORE: Louise Fischer: లైవ్ ఇంటర్వ్యూలో శృంగారంలో పాల్గొన్న రిపోర్టర్.. వీడియో వైరల్!