Fatah 4 vs BrahMos: ఎన్ని పరాభావాలు ఎదురైన తన బుద్ధి మార్చుకొని దేశం పాకిస్థాన్. ఆపరేషన్ సింధూర్‌లో భారతదేశం చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న తర్వాత పాక్ భారత బ్రహ్మోస్ లాంటి క్షిపణిని అభివృద్ధి చేసినట్లు తాజాగా పేర్కొంది. పాకిస్థాన్ సైన్యం మంగళవారం దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణి ఫతా-4ను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది. ఈ క్షిపణి దేశం సాంప్రదాయ క్షిపణి సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆ దేశ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.
READ ALSO: Philippines: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి
ఫతా-IVపై పాక్ సైన్యం స్పందన ఏంటి..
పాకిస్థాన్ సైన్యం మీడియా విభాగం అయిన ISPR ప్రకారం.. ఫతా-4 అనేది ఉపరితలం నుంచి ఉపరితలానికి 750 కిలోమీటర్ల (470 మైళ్లు) పరిధి కలిగిన క్షిపణి అని పేర్కొంది. ఇది అధునాతన ఏవియానిక్స్, ఆధునిక నావిగేషన్ వ్యవస్థలతో రూపొందించిన క్షిపణిగా తెలిపింది. అయితే పాక్ ఈ క్షిపణిని ఎక్కడ ప్రయోగించిందో మాత్రం వెల్లడించలేదు. ఇక్కడ విశేషం ఏమిటంటే భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి 800 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుందని రక్షణ వర్గాలు చెబుతున్నాయి. ఫతా-4 భూమికి దగ్గరగా ఎగురుతూ శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను తప్పించుకోగలదని, అత్యధిక కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని ISPR పేర్కొంది. ఈ క్షిపణి దాని సాంప్రదాయ క్షిపణి వ్యవస్థల పరిధి, ప్రాణాంతకతను, మన్నికను పెంచుతుందని సైన్యం చెబుతోంది. పాకిస్థాన్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఫతా-4 క్షిపణి S-400 లాగా భారత వైమానిక రక్షణ వ్యవస్థలపైకి కూడా చొచ్చుకుపోగలదని చెబుతుంది.
ISPR దీనిని కొత్తగా ఏర్పడిన ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ సాధించిన ప్రధాన విజయంగా అభివర్ణించింది. ఫతా-4 పాక్ దీర్ఘ-శ్రేణి సంప్రదాయ క్షిపణి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని అక్కడి సైన్యం పేర్కొంది. ఫతా-4 విజయవంతమైన పరీక్షపై అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్, త్రివిధ దళాల అధిపతులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అభినందించారు. అధ్యక్షుడు జర్దారీ దీనిని పాక్ రక్షణ వ్యవస్థలో ఒక “మైలురాయి”గా పేర్కొన్నారు. ఫతా-4 దేశం “శాస్త్రీయ స్వావలంబన”కు నిదర్శనమని చెప్పారు.
ఫతా-4 స్పెషల్ ఏంటి?
పరిధి: 750 కి.మీ
వేగం: మాక్ 0.7 (సుమారుగా 865 కి.మీ/గం)
కచ్చితత్వం: మిస్ సంభావ్యత కేవలం 4 మీటర్లు
పేలోడ్ సామర్థ్యం: 330 కి.గ్రా
పొడవు: 7.5 మీ
బరువు: 1,530 కి.గ్రా
భారతదేశం పాకిస్థాన్ 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు యుద్ధంలో తలపడ్డాయి. ఈక్రమంలో రెండు దేశాలు కూడా ఒకరినొకరు దృష్టిలో ఉంచుకుని తరచుగా తమ క్షిపణుల కొత్త వెర్షన్లను పరీక్షిస్తాయి. ISPR నివేదిక ప్రకారం.. ఇంత తక్కువ CEP (4 మీటర్లు) పాకిస్తాన్ క్షిపణులకు ఒక అద్భుతమైన విజయంగా పేర్కొంటున్నాయి. ఇక్కడ ప్రముఖ విషయం ఏమిటంటే.. పాక్ తాజాగా విజయవంతంగా పరీక్షించిన ఫతా-4 క్షిపణి కంటే భారత్ బ్రహ్మోస్ పరిధి ఎక్కువ. ఇండియా బ్రహ్మోస్‌ను బీట్ చేయడానికి పాక్ ఫతా-4కి సామర్థ్యం సరిపోలేదని రక్షణ వర్గ నిపుణులు చెబుతున్నారు.
READ ALSO: Astrology: అక్టోబర్ 01, బుధవారం దినఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే..?