నకిలీ పైలట్ లైసెన్స్ కుంభకోణం తర్వాత ఐదేళ్ల పాటు నిషేధించబడిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) శనివారం యునైటెడ్ కింగ్‌డమ్ (UK) కు తన విమానాలను తిరిగి ప్రారంభించింది. “జూలై 2020 తర్వాత ఇస్లామాబాద్ నుండి మాంచెస్టర్‌కు మొదటి విమానం 284 మంది ప్రయాణికులతో బయలుదేరింది” అని PIA ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ కూడా విమానంలో ప్రయాణించారు.
Also Read:Student: మద్యం షాపు వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు.. షాకిచ్చిన అధికారులు..
2020లో కరాచీలో దాదాపు 100 మంది ప్రయాణికులు మరణించిన విషాదకరమైన విమాన ప్రమాదం తరువాత యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA) మరియు UK సివిల్ ఏవియేషన్ అథారిటీ PIA విమానాలను నిషేధించాయి. అప్పటి విమానయాన మంత్రి గులాం సర్వార్ ఖాన్ పెద్ద సంఖ్యలో పాకిస్తానీ పైలట్లు నకిలీ లైసెన్సులు కలిగి ఉన్నారని వెల్లడించారు.
గత ఏడాది నవంబర్‌లో EASA నిషేధాన్ని ఎత్తివేసింది, అయితే UK ఈ ఏడాది జూలైలో పాకిస్తాన్‌ను తన విమాన భద్రతా జాబితా నుండి తొలగించింది, దీని ద్వారా పాకిస్తాన్ విమానయాన సంస్థలు బ్రిటన్‌కు విమానాలు నడపడానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. విమానం బయలుదేరే ముందు ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక సాధారణ వేడుక జరిగింది. దీనికి రక్షణ మంత్రిత్వ శాఖ, దౌత్య కార్యకలాపాలు, విమానయాన రంగానికి చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.
Also Read:Star Heroine’s : ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు.. స్టార్ హీరోయిన్స్ ఇలా అన్నారేంటి
ఈ సందర్భంగా రక్షణ మంత్రి ఆసిఫ్ మాట్లాడుతూ, ప్రత్యక్ష విమానాలను తిరిగి ప్రారంభించడం వల్ల పాకిస్తాన్, యుకె మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. యుకెలో నివసిస్తున్న 1.6 మిలియన్లకు పైగా పాకిస్తానీయులకు ఈ సేవ మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ ఆప్షన్స్ ను అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రారంభంలో ఇస్లామాబాద్, మాంచెస్టర్ మధ్య వారానికి రెండు విమానాలను మంగళ, శనివారాల్లో నడుపుతామని, క్రమంగా లండన్, బర్మింగ్‌హామ్‌లకు కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తున్నట్లు PIA తెలిపింది.