ఆర్థిక పేదరికంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌లో శాంతిభద్రతలు కూడా దెబ్బతిన్నాయి. ప్రతిరోజూ, పాకిస్తాన్‌లో దొంగలు బహిరంగంగా తుపాకీతో ప్రజలను దోచుకుంటున్నారు. దేశంలో క్రైమ్ రేట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్ కేర్‌టేకర్ మంత్రి, బ్రిగేడియర్ (రిటైర్డ్) హరీస్ నవాజ్ ప్రజలకు ఆసక్తికర అభ్యర్థన చేశారు.