Pakistan Blast: పాకిస్థాన్ లో బాంబ్ బ్లాస్ట్.. ఏడుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ దేశంలో నిన్న (సోమవారం) అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్ సహా కనీసం ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. అయితే, నిన్న (సోమవారం) సాయంత్రం ఒక వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బల్గతార్ యుసీ ఛైర్మన్ ఇష్తియాక్ యాకూబ్ తో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న ఇతరులను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రిమోట్ సాయంతో పేల్చడానికి ల్యాండ్‌మైన్ అమర్చారని పంజ్‌గూర్ డిప్యూటీ కమిషనర్ అమ్జద్ సోమ్రో ప్రకటించారు.
Read Also: Sahara Refund Status: 11 ఏళ్లలో రూ.138.07 కోట్లు పొందిన సహారా ఇన్వెస్టర్లు… వివరాలు వెల్లడించిన సెబీ
Also Read
- Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
- Pawan Kalyan: ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. ఏనుగుల సంరక్షణపై పవన్ కల్యాణ్ కీలక సందేశం
వాహనం బల్గతార్ ప్రాంతంలోని చకర్ బజార్ దగ్గరకు రాగానే దుండగులు రిమోట్ సాయంతో వాహనాన్ని పేల్చివేశారని ఫలితంగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మరణించినట్లు స్థానికులు చెప్పారు. మృతుల్లో మహ్మద్ యాకూబ్, ఇబ్రహీం, వాజిద్, ఫిదా హుస్సేన్, సర్ఫరాజ్, హైదర్ గా గుర్తించారు. వీరంతా బల్గతార్, పంజ్‌గూర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు అన్నారు.
Read Also: Viral Video Today: పొరపాటున ఫస్ట్ గేర్.. జలపాతంలో పడిపోయిన కారు! వీడియో వైరల్
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో 2014లో ఇష్తియాక్ యాకూబ్ తండ్రి యాకుబ్ బల్గాత్రితో పాటు అతని పదిమంది అనుచరులను కూడా ఇదే తరహాలో బాంబు దాడిలో హత్య చేసినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆనాటి ఆ దాడికి సూత్రధారులం తామేనంటూ బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అప్పుడే ప్రకటించింది. తాజాగా జరిగిన సంఘటనకు కూడా వారే బాధ్యులై ఉంటారని అధికారులు భయపడుతున్నారు. అయితే, ఈ దాడి ఎవరు చేశారు అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.
తాజావార్తలు
-
Best FD Interest Rates August 2026: FDపై 8.50 శాతం వరకు వడ్డీ.. ఆగస్టు 2026లో టాప్ రేట్లు అందిస్తున్న బ్యాంకుల పూర్తి జాబితా
-
Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
-
Mallika Sherawat: ‘టామ్ క్రూజ్‌కు నాపై క్రష్’.. వీడియో కూడా ఉంది.. 49 ఏళ్ల మల్లికా కామెంట్స్ వైరల్
-
Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
-
Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!