Viral Video Today: పొరపాటున ఫస్ట్ గేర్.. జలపాతంలో పడిపోయిన కారు! వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Falls In Waterfall at Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జలపాతం అంచన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్‌లో కుంద్ జలపాతం ఉంది. ఈ జలపాతంను చూసేందుకు గత కొద్ది రోజులుగా భారీగా జనాలు వస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం ఓ కుటుంబం అక్కడికి విహార యాత్రకు వచ్చింది. కారుని జలపాతం అంచున పార్క్ చేశారు. కొద్దిసేపటి తర్వాత కారు అకస్మాత్తుగా జలపాతం వైపు జారిపోయింది. అందరూ చూస్తుండగానే.. జలపాతంలోకి పడిపోయింది. కారు పడే సమయంలో డోర్ ఊడిపోయింది. దాంతో భర్త నీటిలో పడగా.. అతడి భార్య, కూతురు లోపలే చిక్కుకున్నారు.
Also Read
Also Read: Itchy Eyes Home Remedies: కళ్ల దురదతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ హోం రెమెడీస్‌తో ఇట్టే చెక్ పెట్టండి!
కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి జలపాతంలోకి దూకి భర్తను కాపాడాడు. ఇంకొందరు భార్య, కూతురును కాపాడారు. ఆపై వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. రవర్స్ గేర్ బదులుగా.. పొరపాటున ఫస్ట్ గేర్ వేయడంతో కారు జలపాతంలో పడిపోయిందని సమాచారం తెలుస్తోంది. కారు జలపాతంలో పడిపోయిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అప్పుడూ కూడా అంచుల వద్ద పార్క్ చేయకూడదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/sidd_sharma01/status/1688483581440729088?s=20
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!