విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు.
ప్రస్తుతం పాకిస్థాన్ అన్ని వైపుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో జరిగిన రైలు హైజాక్ సంఘటనపై ఒకవైపు రష్యా, ఆఫ్ఘనిస్తాన్ వంటి స్నేహపూర్వక దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, పాకిస్థాన్ వైఖరిపై భారత్ కూడా మండిపడింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్‌లో భారతదేశ ప్రమేయం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ చేస్తున్న ఈ నిరాధారమైన అర్థంలేని ప్రచారాన్ని భారతదేశం తీవ్రంగా తిరస్కరించింది.
పాకిస్తాన్‌లోని రెండవ అతి పెద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడికి దిగింది. పాక్ మీడియాకు అందిన సమాచారం ప్రకారం బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది.
బలూచిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్- ఇరాన్ అంగీకరించాయి. తీవ్రవాద లక్ష్యాలపై ఇటీవలి ఘోరమైన వైమానిక దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచాయి.
పాకిస్థాన్ దేశంలో నిన్న (సోమవారం) అర్ధరాత్రి బలూచిస్తాన్‌లోని పంజ్‌గూర్ జిల్లాలో ఒక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు ల్యాండ్‌మైన్ పేల్చారు. ఈ పేలుడులో యూనియన్ కౌన్సిల్ ఛైర్మన్ సహా కనీసం ఏడుగురు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల కావడంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో పీసీబీ చైర్మన్‌కు సంబంధించి ఎన్నికపై బలూచిస్తాన్ హైకోర్టు స్టే విధించింది. జూలై 17 వరకు ఎన్నికలు నిర్వహించకూడదని పేర్కొంది.
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో దాదాపుగా 15 మంది మృతి చెందారు. 200 మందికి పైగా గాయాలయ్యాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టాలో ఆ భూకంపం సంభవించింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6 గా నమోదైంది. భూకంపాలు సంభవించే జోన్‌లో…