జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత దేశవ్యాప్తంగా దుఃఖం, కోపం అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. ఉగ్రదాడుల్లో చురుకుగా పాల్గొంటున్న 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను నిఘా సంస్థలు సిద్ధం చేశాయి. ఈ స్థానిక ఉగ్రవాదులు పాకిస్థాన్ ఉగ్రవాదులకు కీలక మద్దతుదారులుగా సంస్థలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదులకు మద్దతు, రవాణా సహాయం, ఉగ్రవాదులకు ఆశ్రయం, వనరులను సమకూరుస్తున్నారని తేల్చాయి. ఈ 14 మంది ఉగ్రవాదుల లిస్ట్‌ను జాతీయ మీడియా సంస్థ "ఆజ్ తక్" వెల్లడించింది. వారిని ఒక్కొక్కరిగా…
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. ఈ దాడికి బాధ్యతను టీఆర్‌ఎఫ్ అనే ఉగ్రవాద సంస్థ తీసుకుంది. ఈ సంస్థ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'గా గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లో లష్కరే, టీఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా…