Akhanda 2 Tandavam OTT: బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘అఖండ2: తాండవం’. ఈ సినిమా డిసెంబరులో విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని అఖండ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి బాలయ్య అభిమానులతో పాటు, సినిమా ప్రేమికులను అలరించడానికి రడీ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘అఖండ2: తాండవం’ స్ట్రీమింగ్ కానున్నట్లు అఫిషియల్‌గా తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ పోస్ట్ చేసింది.
READ ALSO: Nicolas Maduro: ‘‘దమ్ముంటే నన్ను పట్టుకో..’’ అన్నంత పనిచేసిన ట్రంప్..
అఖండ 2 తాండవం కథ ఏంటంటే…
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మొదటి భాగానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందించారు. ఒక రకంగా ఆ జరిగిన కథకు సుమారు 17, 18 సంవత్సరాల తరువాత ఈ కథ జరుగుతుంది. ఊరిలో ఉండే అఖండ సోదరుడి(బాలకృష్ణ 1) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) డీఆర్డీఓలో ట్రైనీగా చేరుతుంది. అక్కడ ట్రైనింగ్‌లో ఉండగా, భారతీయులందరూ ఎంతో పవిత్రంగా భావించే కుంభమేళాలో వైరస్ ఎటాక్ అవుతుంది. తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఆ వైరస్‌ను కట్టడి చేయొచ్చని తెలిసిన జనని, తన మెంటార్ (సంయుక్త మీనన్)తో కలిసి దాన్ని సిద్ధం చేస్తుంది. అయితే ఆ వైరస్ మొత్తాన్ని భారతీయులందరిలో ఎక్కించాలని దురుద్దేశంతో ఉన్న ఠాగూర్ (కబీర్ దుల్హన్ సింగ్) యాంటిడోడ్ కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. అయితే శివారాధనలో ఉన్న అఖండ శిఖందర్ రుద్ర (బాలకృష్ణ 2), జనని ఆపదలో ఉందని తెలుసుకుని ఆమెకి ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. అసలు కుంభమేళా గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక అసలు ఎవరు ఉన్నారు? ఈ విషయం తెలిసిన అఖండ ఏం చేశాడు? ఇందులో నేత్ర (ఆది పినిశెట్టి) పాత్ర ఏమిటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
READ ALSO: Jagtial: మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టవేరా.. పలువురికి తీవ్ర గాయాలు