OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: తెలంగాణ రైస్ మిల్లుల్లో ఈడీ సోదాలకు, ఆపరేషన్ ఆకర్ష్‌కు లింక్ ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకురాలి ఇంటి మీద మాత్రమే దాడులు జరగడాన్ని ప్రత్యేకంగా చూడాలా? బియ్యం ఎగ్గొట్టినోళ్ళు చాలామందే ఉన్నప్పుడు నా మిల్లు మీదికే ముందు ఎందుకన్న కాంగ్రెస్ నేత ప్రశ్నకు సమాధానం ఉందా? అసలు ఈడీ దాడుల చుట్టూ జరుగుతున్న రాజకీయ రచ్చ ఏంటి? సొంత పార్టీ వాళ్ళే కుట్ర చేస్తున్నారన్న రేఖా నాయక్ ఆరోపణల్లో నిజమెంత? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలకు ఇప్పుడు ఈడీ వేడి తగులుతోంది. దాని చుట్టూ రచ్చ కూడా మొదలైపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేఖా నాయక్ ఇంట్లో 9 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మూడు బృందాలు విడిపోయి మరీ..సోదాలు చేశారు. రేఖా నాయక్‌కు స్థానికంగా సత్తెనపల్లిలో రైస్ మిల్లు ఉంది. దాని నుంచి 40 కోట్ల 96 లక్షల రూపాయల విలువైన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కింద ఇవ్వక పోవడంతో ఇదివరకే కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా ఆమె డబ్బులు చెల్లించకపోగా కోర్టుకు వెళ్ళారు.
ఈ పరిస్థితుల్లో…ఇప్పుడు ఏకంగా ఈడీనే రంగంలోకి దిగడం వెనక రాజకీయ కుట్ర ఉందన్నది ఆమె అనుమానం. రాష్ట్రంలో 145 మందికిపైగా రైస్ మిల్లర్ల మీద కేసులు నమోదయ్యాయని, అందర్నీ వదిలేసి మొదటి సారిగా నా ఇంట్లోనే సోదాలు ఎందుకు చేశారన్నది ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే క్వశ్చన్. ఇది సొంత పార్టీ నేతల కుట్ర అని భావిస్తున్నారట రేఖా నాయక్. ఖానాపూర్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే చెందిన వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్‌కు గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. దాంతో… గులాబీ నాయకత్వం మీద ఘాటు వ్యాఖ్యలే చేసిన రేఖ తన భర్త శ్యాం నాయక్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా… రైస్ మిల్లు నుంచి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వలేదంటూ పౌరసరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు చేయడం, ఇప్పుడు ఏకంగా ఈడీ దాడులు
జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Also Read
లోకల్ ఎమ్మెల్యే… ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతతో చెప్పించి సోదాల కోసం తమ పైకి పంపించారన్నది రేఖా నాయక్ వర్గం ఆరోపణ. అయితే.. సీఎంఆర్ బియ్యం గోల్మాల్ పై సర్కార్ సీరియస్ గా ఉండడం, రేఖానాయక్ ప్రత్యర్థులు సైతం పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ… బియ్యం బొక్కేశారని కామెంట్ చేయడం లాంటివి కూడా పని చేసి ఉండవచ్చని అంటున్నారు కొందరు. రేఖా నాయక్ మాత్రం… సొంత పార్టీ వారితో పాటు ఇతర పార్టీల కుట్రల వల్లనే దాడులు జరిగాయంటూ…సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానని అంటున్నారు. దాన్నిబట్టి ఆమె పరోక్షంగా సొంత పార్టీ నేతలనే లక్ష్యంగా చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు చేసిన విధంగా తానెవ్వరినీ మోసం చేయలేదంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా… పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ గోల్మాల్ విషయంలో చాలామంది బడా మిల్లర్లపై కేసులు ఉన్నాయి. కోట్ల రూపాయల బియ్యం మాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వాళ్ళందర్నీ పెద్ద పెద్ద నాయకులు కాపాడుతున్నారని, కేసులు, వేధింపులకు మేమే దొరికామా? అని ప్రశ్నిస్తున్నారు ఎక్స్ ఎమ్మెల్యే. పైగా.. మిగతా వారికంటే తాను ఇవ్వాల్సిన డబ్బులు తక్కువేనని, అయినా… కేవలం గిరిజన బిడ్డను కాబట్టే పెద్దోళ్ళందర్నీ వదిలేసి ఈడీని నేరుగా తన మీదికే పంపారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారామె. అయితే.. ఈ వ్యాఖ్యల్ని తిప్పికొడుతున్నారు ఎమ్మెల్యే బొజ్జు. ఈడీ దాడులతో నాకేం సంబంధమంటూ ప్రశ్నిస్తున్నారాయన. అయినా… కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ నేను చెబితే వింటుందా అంటూ లాజికల్‌గా ప్రశ్నిస్తున్నారు.
రేఖా నాయక్ రైస్ మిల్లుల్లో వంద కోట్ల దాకా బకాయిలు ఉన్నాయంటూ లెక్కలున్నాయని చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో ఇతర పార్టీల నాయకులు సైతం రివర్స్ పంచ్‌లు వేస్తున్నారు. బియ్యం తిన్నది వాళ్లు, దోపిడీ చేసింది వాళ్లు, ఈడీ వస్తే మాత్రం మేం బాధ్యులమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా… అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దంపతుల ఇళ్ళు, ఆఫీసుల్లో ఈడీ రైడ్స్ జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. ఈడీ మేం చెబితే వస్తుందా అంటూ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కామెంట్ చేస్తుండటంతో… రేఖా నాయక్ వర్గానికి ఎటూ సమర్ధించుకోలేని పరిస్థితి వచ్చిందంటున్నారు పరిశీలకులు. అయితే… ఈ ఎపిసోడ్‌ని కొందరు కాస్త డిఫరెంట్ యాంగిల్లో చూస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లోనే ముందు సోదాలు చేస్తే… మిగతా వాళ్లు భయపడి పోయి మొండి బకాయిల్ని చకచకా కట్టేస్తారన్న వ్యూహం కూడా ఇందులో ఉండి ఉండవచ్చంటున్నారు. సోదాలకు వచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి ఇందులో ఆపరేషన్ ఆకర్ష్ యాంగిల్ కూడా ఉండి ఉండవచ్చన్నది ఇంకొందరు అనలిస్ట్‌ల అభిప్రాయం. కారణం ఏదైనాగానీ… రేఖా నాయక్ ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ దాడులు మాత్రం కావాల్సినంత పొలిటికల్ మసాలా ఇచ్చాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. కుట్ర కోణం ప్రస్తావనని అలా ఉంచితే… మిగతా డిఫాల్ట్ రైస్ మిల్లర్ల ఇళ్ళు, ఆఫీసుల్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తుందా…లేదా అన్నది ప్రస్తుతానికి ఇంట్రస్టింగ్ టాపిక్.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
-
Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..
-
Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!
-
CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!