Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!
- యూఎస్ ఎఫ్-16పై దాడి చేశామని ప్రకటించిన ఇరాన్..
- క్షిపణి దాడితో యుద్ధ విమానం ఎమర్జెన్సీ ల్యాండైందని ప్రకటన..
- ఇరాన్ వాదనల్ని అవాస్తమని చెప్పిన అమెరికా సెంట్రల్ కమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ వద్ద ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని ఇరాన్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధ్వరంలోని తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. శనివారం ఇరాన్ సైన్యం ప్రకటన ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా ఎఫ్-16 జెట్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గుర్తించినట్లు తెలిపింది.
అమెరికా విమానాన్ని గుర్తించి, దాని కదలికల్ని నిరంతరం పర్యవేక్షించామని ఇరాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వెల్లడించింది. విమానాన్ని టార్గెట్ చేసిన క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఈ క్షిపణి యుద్ధ విమానానికి సమీపంలో పేలిందని, దీంతో విమానం దెబ్బతిన్నట్లు చెప్పింది. దీంతో పైలట్ తన మిషన్‌ను మధ్యలో నిలిపేసి, సమీపంలోని వైమానిక స్థావరంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇరాన్ పేర్కొంది.
Also Read
- US-China Chip War: అమెరికా-చైనా మధ్య చిప్ వార్.. 5 దేశాలపై ఆంక్షలు.. ఏఐ రంగంలో సంక్షోభం!
- US Report: భారత్ ఎదుగుదలను తట్టుకోలేక.. ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా మద్దతు..
- Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో హింసాకాండ.. హసీనా పార్టీ నేతల ఆస్తులకు నిప్పు!
- Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
ఇదిలా ఉంటే, ఇరాన్ వాదనల్ని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) తోసిపుచ్చింది. ఇరాన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమానాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు, అమెరికాకు చెందిన ఎంక్యూ 9 రీపర్ డ్రోన్లను కూడా కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 58 అమెరికా డ్రోన్లను ధ్వంసం చేశామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!
-
CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
-
Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!