Operation Sindoor : భారత దాడిలో జైషే టాప్ కమాండర్ హతం..!
- పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మెరుపుదాడి
- బహవల్పూర్, మురీద్కేలో ఉగ్ర స్థావరాలపై పిడుగు దాడులు
- మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా అనే అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor : పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి ఇంకా మన కళ్లముందు మెదులుతూనే ఉంది. భార్యల కళ్లెదుటే భర్తలను పొట్టన పెట్టుకున్న ఆ దుర్మార్గుల చర్య యావత్ భారతావనిని కలచివేసింది. అయితే, ఇప్పుడు ఆ బాధకు ప్రతిస్పందనగా భారత్ గర్జించింది. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రమూకల స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. భారత సైన్యం పాకిస్తాన్ , పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఏకంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని ఈ మెరుపు దాడులు జరిగాయి.
ఈ దెబ్బతో ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అనడంలో సందేహం లేదు. అయితే, అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే – ఈ దాడిలో భారత దేశానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉగ్రనేతలు హఫీజ్ సయీద్ , మసూద్ అజహర్ హతమయ్యారా?
Also Read
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ హతమయ్యారా?
భారతదేశం మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్‌లో వారి ప్రధాన కార్యాలయం , మదర్సా నేలమట్టం అయ్యాయి. పాకిస్తాన్ మీడియా స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ దాడిలో జైష్-ఎ-మహ్మద్‌కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
అంతేకాకుండా, మురీద్కేలోని లష్కర్-ఎ-తైబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కర్ , జైష్‌కు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. అయితే, ఈ దాడుల్లో మసూద్ అజహర్ , హఫీజ్ సయీద్ మరణించినట్లు అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు.
భారతదేశం చేసిన ఈ దాడుల అనంతరం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దాడిని ఆయన స్వయంగా ధృవీకరించారు. “భారత్ మాపై యుద్ధం ప్రకటించింది. మాకు తిప్పికొట్టే హక్కు ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత సైన్యం మెరుపువేగంతో విరుచుకుపడిన ప్రాంతాలివే:
ముజఫరాబాద్‌లో 2 స్ట్రైక్‌లు, బహవల్పూర్లో 3వ స్ట్రైక్, కోట్లీలో 4వ , చాక్ అమ్రూలో 5వ దాడి, గుల్పూర్లో 6వ , భింబర్‌లో 7వ దాడి, మురీద్కేలో 8వ, సియాల్కోట్లో 9వ దాడి.
తాజావార్తలు
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!