తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దూసుకెళుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. నాలుగో రౌండ్ లోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కొడంగల్‌లో ఆధిక్యంలో ఉన్నారు. నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి 5687 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మరోవైపు కోరుట్లలో బీఆర్ఎస్‌కు 1201 ఓట్ల ఆధిక్యం ఉంది. ధర్మపురిలో 1439 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్, కుత్బుల్లాపూర్‌లో ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి బీఆర్ఎస్‌కు 13,588 లీడ్, చేవెళ్లలో మూడో రౌండ్ ముగిసే సరికి 2079 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్, కామారెడ్డిలో నాలుగో రౌండు ముగిసేసరికి బీజేపీ లీడ్, మహేశ్వరంలో మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 335 లీడ్, స్టేషన్ ఘనపూర్‌లో కడియం శ్రీహరికి 1671 ఓట్ల ఆధిక్యం, సిర్పూర్‌లో మూడు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ అభ్యర్థికి 4891 ఓట్ల ఆధిక్యంలో ఉంది. అటు.. మహేశ్వరంలో నాల్గో రౌండ్ ముగిసే సరికి బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డికి 1272 ఓట్ల ఆధిక్యం, ఇబ్రహీంపట్నంలో మూడో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి 5395 ఓట్ల ఆధిక్యం, స్టేషన్ ఘన్ పూర్ లో 5వ రౌండ్ లో కడియం శ్రీహరికి 1083 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.