OnePlus Nord: వన్ ప్లస్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ను విడుదల చేయడానికి జూలై 8న భారతదేశంతో పాటు ఇతర దేశాల గ్లోబల్ మార్కెట్ల కోసం సమ్మర్ లాంచ్ ఈవెంట్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో OnePlus Nord 5, OnePlus Nord CE 5, OnePlus Buds 4 లాంచ్ చేయనున్నారు. మరి కొత్తగా విడుదలకానున్న ఈ మొబైల్స్, ఇయర్‌బడ్స్ వివరాలను చూసేద్దామా..
OnePlus Nord 5:
ఇది Nord సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్ లెవల్ ఎంట్రీ మొబైల్. OnePlus Nord 5 ఫోన్‌లో Snapdragon 8s Gen 3 Mobile Platform ప్రాసెసర్‌ను వినియోగించనున్నారు. ఇది Nord సిరీస్‌లో మొదటిసారి Snapdragon 8 సిరీస్‌కి చెందిన చిప్‌సెట్‌ను వాడనున్న మొబైల్. ఈ ఫోన్ LPDDR5X RAMతో రానుంది. ఫోన్ టీజర్ ప్రకారం, దీని రియర్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరాలు అలాగే వాటి క్రింద LED ఫ్లాష్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇటీవల చైనా మార్కెట్లో వచ్చిన OnePlus Ace 5 Ultra Edition డిజైన్ లా కనపడుతుంది.
Read Also: POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!
ఇక గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ మొబైల్ 90fps సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రేమ్ ఇంటర్‌పోలేషన్ సాయంతో 144fps వరకూ పెంచుతుంది. ఈ ఫోన్‌లో 7300mm² VC కూలింగ్ ఏరియా, ఫ్లాగ్ షిప్ గ్రేడ్ గ్రాఫిన్ థర్మల్స్ ఉన్నాయి. ఇవి OnePlus 13 లెవల్‌లో 1800W/m-K థర్మల్ ఎఫిషియెన్సీని అందిస్తాయని కంపెనీ తెలిపింది.
OnePlus Nord CE 5:
స్టైలిష్ డిజైన్‌తో మిడ్‌రేంజ్ పర్‌ఫార్మర్ గా ఈ మొబైల్ ఎంట్రీ ఇవ్వనుంది. Nord CE 5 కూడా డ్యూయల్ రియర్ కెమెరాలతో రానుంది.మొబైల్ బ్యాక్ కవర్ పై ప్రత్యేక డిజైన్ ప్యాటర్న్స్ ఉండనున్నాయి. ఫోన్ స్పెసిఫికేషన్లను పూర్తిగా వెల్లడించకపోయినా, ఇది Nord సిరీస్‌లో సరసమైన ధరలో ఉత్తమ ఫీచర్లను అందించనుందని అంచనా.
Read Also: Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!
OnePlus Buds 4:
OnePlus Buds 4 అధునాతన ఆడియో ఫీచర్లతో రానుంది. ఈ ఇయర్ బడ్స్ డ్యూయల్ డ్రైవర్స్, డ్యూయల్ DACs, Hi-Res LHDC 5.0, 3D స్పేషియల్ ఆడియో ఫీచర్లతో రానుంది. ఇందులో గేమింగ్ కోసం 47ms అల్ట్రా లో లేటెన్సీ గేమ్ మోడ్ కూడా ఉంది. ఇవి జెన్ గ్రీన్, స్టార్మ్ గ్రే రెండు కలర్ వేరియంట్లలో లభించనున్నాయి. ఇవే బడ్స్ చైనాలో ఇప్పటికే లాంచ్ అయ్యాయి.
అవి 55dB వరకు Active నాయిస్ క్యాన్సలేషన్, 5500Hz అల్ట్రా-వైడ్‌బ్యాండ్ సపోర్ట్, ఇంకా 3 మైక్ AI కాల్ నాయిస్ రిడక్షన్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ ప్రాడక్ట్స్ లాంచ్ అనంతరం అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్, అలాగే ఆఫ్లైన్ స్టోర్లలో విక్రయించబడతాయి.