POCO F7: పోకో మొబైల్స్ అభిమానులకు శుభవార్త. POCO F7 స్మార్ట్‌ఫోన్ భారతదేశం సహా గ్లోబల్ మార్కెట్లలో జూన్ 24న విడుదల కానునట్లు పోకో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ పరంగా చైనా మార్కెట్‌లో విడుదలైన Redmi Turbo 4 Proకి దగ్గరగా కనిపిస్తున్నప్పటికీ, స్పెసిఫికేషన్లు మాత్రం వేరుగా ఉండనున్నాయి.
Read Also: HONDA CBR 650R: మార్కెట్లోకి కొత్త హోండా బైక్.. గేర్లు మార్చేందుకు క్లచ్ నొక్కనవసరం లేదు గురూ..
POCO F7లో భారత్‌కు ప్రత్యేకంగా 7550mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీను ఉపయోగించారు. ఇది భారతదేశంలో ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌లో వచ్చిన అత్యంత పెద్ద బ్యాటరీగా భావిస్తున్నారు. ఈ ఫోన్ 90W ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది. అంతేకాకుండా, ఇది 22.5W రివర్స్ వైర్డ్ చార్జింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. అయితే గ్లోబల్ వేరియంట్‌లో మాత్రం 6500mAh బ్యాటరీ ఉంటుంది. అందువల్ల, ఆ వెర్షన్ భారత మోడల్‌తో పోలిస్తే కొంచెం తక్కువ బరువు (215.7g) కలిగి ఉంటుంది.
POCO F7 మొబైల్ స్పెసిఫికేషన్స్ అంచనా పరంగా ఇలా ఉండనున్నాయి.
డిస్ప్లే: 6.83 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే (2800 x 1280 పిక్సెళ్స్), 120Hz రిఫ్రెష్ రేట్, 2560Hz టచ్ శాంప్లింగ్ రేట్, డాల్బీ విజన్, 3840Hz PWM డిమ్మింగ్, 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్
ప్రాసెసర్: Snapdragon 8s Gen 4 (4nm) చిప్‌సెట్ @ 3.2GHz, Adreno 825 GPU
స్టోరేజ్: 12GB LPDDR5X RAM, 256GB / 512GB UFS 4.1 స్టోరేజ్
ఓఎస్: Android 15 ఓఎస్ తో పాటు Xiaomi HyperOS 2, డ్యూయల్ సిమ్ (నానో + నానో)
కెమెరా: 50MP ప్రధాన కెమెరా (LYT-600 సెన్సార్, OIS, EIS), 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 4K@60fps వీడియో రికార్డింగ్, 20MP సెల్ఫీ కెమెరా (OV20B సెన్సార్), 1080p@60fps వీడియో
* ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్
* USB Type-C ఆడియో, స్టీరియో స్పీకర్లు
* ధూళి, నీటి నిరోధకత కోసం (IP68 రేటింగ్)
పరిమాణాలు: 163.1 x 77.93 x 7.98mm (ఇండియా), 8.2mm (గ్లోబల్)
బరువు: 219g (ఇండియా), 215.7g (గ్లోబల్)
* 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, GPS, NavIC, NFC
* 7550mAh (ఇండియా) / 6500mAh (గ్లోబల్) బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్
ఇక ఈ POCO F7 ప్రారంభ వేరియంట్ 12GB + 256GB మోడల్‌గా రానుంది. దీని ధర రూ. 30,000 నుండి రూ. 35,000 మధ్యలో ఉండే అవకాశముంది. ప్రారంభ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండొచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే విక్రయించబడుతుంది. POCO F7 పర్‌ఫార్మెన్స్, బ్యాటరీ పవర్‌ను కోరుకునే వినియోగదారులకు ఉత్తమ ఎంపికగా మారనుంది.