సంక్రాంతి దగ్గరపడ్తుంటేనే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం మొదలైపోతుంది. కుటుంబం అంతా ఒకేచోట చేరి సందడిగా జరుపుకునే ఈ పండగ కోసం పెద్దలు, చిన్నలు, ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు.
విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని, ఎలాంటి యాప్‌ల గొడవ ఉండదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘వన్ క్లాస్-వన్ టీచర్’ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్‌ను రూపొందిస్తున్నామన్నారు. ఈ నెలలోనే 16,473 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి…
వేసవి సెలవుల అనంతరం ఏపీలో నేడు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవు వచ్చింది.
ఏపీలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేసవిలో వడగాలుల సందర్భంగా స్కూళ్లల్లో జాగ్రత్తలు తీసుకుంటుంది విద్యాశాఖ. ఈ క్రమంలో.. వాటర్ బెల్ విధానాన్ని ప్రవేశపెడుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు డీ-హైడ్రేషనుకు గురి కాకుండా వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడు సార్లు వాటర్ బెల్ మోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ చేశారు.
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకటించారు. ఏఇందుకు సంబంధించి ఏపీ విద్యాశాఖ వివరాలను తెలిపింది. 10వ తరగతి ఉతీర్ణత పొందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని…
ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24వరకు ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపింది.
ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకుచదువుతున్న 43,10,165 మంది విద్యార్థినీ, విద్యార్థులకు రూ. 1,042.53 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ.. క్రోసూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్.
ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు ఇవాళ్టి( ఆదివారం)తో ముగిసిపోనున్నాయి. రేపటి( సోమవారం) నుంచి స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్‌కు విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి సెలవులు పొడిగించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాఠశాలల పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.