ఆంధ్రప్రదేశ్ లోని స్టూడెంట్స్ కు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. పాఠశాలలు ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్రంలో విద్యా కానుక అందించాలని సర్కార్ డిసైడ్ అయ్యింది. వేసవి సెలవుల తర్వాత ఏపీ వ్యాప్తంగా పాఠశాలలు రేపటి (సోమవారం ) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అన్ని పాఠశాలలో జగనన్న విద్యా కానుకను అందిస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద స్కూల్ డ్రెస్సులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగ్, బెల్ట్, పుస్తకాలు అందించనున్నట్లు తెలిపారు.
Read Also: OTT Apps : OTT యాప్స్.. మీ జేబును ఎలా లూటీ చేస్తున్నాయో తెలుసుకోండి?
కాగా జగనన్న విద్యా కానుక కింద ఈ ఏడాది ప్రభుత్వం రూ. 1,100కోట్లు ఖర్చు చేస్తుండగా.. విద్యాకానుక పథకాన్ని రేపు (సోమవారం) పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు జగనన్న విద్యా కానుక కిట్లు చేరుకున్నాయి. ఈ విద్యా కిట్ల నాణ్యత విషయంలో సర్కార్ అన్ని చర్యలు తీసుకుంది. నాణ్యతను నాలుగు దశల్లో పరిశీలించామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు.
Read Also: Pawan Kalyan: మారిన పవన్ కల్యాణ్ టూర్ షెడ్యూల్.. నేడే ఏపీకి జనసేన చీఫ్..
అటు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు పేరుతో సత్కరించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూన్ 20న సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయనున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను, పాఠశాల ప్రధానోపాధ్యాలయులను కూడా ప్రభుత్వం సత్కరించనుంది.