NTV Telugu Site icon

DK Aruna: ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే..

Dk Aruna

Dk Aruna

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు. ఈ సర్వే దేనికోసమో స్పష్టం చేయాలి.. బీసీ వర్గాలను మోసం చేయడానికే ఈ సర్వే అని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ సర్వే అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెట్టడం సమంజసమా.. ఎన్నికల్లో ప్రజలను మోసం అధికారంలోకి వచ్చిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Read Also: HYDRA: బెంగళూరులో హైడ్రా బృందం పర్యటన.. పలు ప్రాజెక్టులపై స్టడీ

కేసీఆర్ కాళేశ్వరం పేరుతో దోచుకుంటే.. రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. లక్షన్నర కోట్ల దోపిడీకి మాత్రమే బీజేపీ వ్యతిరేకమని డీకే అరుణ అన్నారు. డ్రైనేజీ వెళ్లకుండా ముందు మూసీ చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టండి.. కుల జన గణన పేరుతో ప్రజలను పక్కదారి పట్టించడం మోసం చేయడమేనని అన్నారు. బీసీల అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు.. రాజకీయంగా మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన వివరాలు మాత్రమే స్వీకరించాలి.. బలవంతంగా వివరాలు స్వీకరిస్తే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్చను హరిస్తుంది.. 60 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఎందుకు కుల గణన చేయలేదని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

Read Also: Truecaller: ట్రూకాలర్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?

Show comments