తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.