V. Hanumantha Rao: కుల గణనపై ఎవరు మాట్లాడనప్పుడే రాహుల్ గాంధీ మాట్లాడారు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు పేర్కొన్నారు. ఎవరు ఎంతో, వారికి అంత అని చెప్పారు.. ఇప్పటి వరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మూడు సార్లు కలిసి బీసీలకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వు అని కోరినా ఇవ్వలేదు.
Caste Census Survey: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కుల గణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
త్వరలోనే రాహుల్ గాంధీకి ధన్యవాద సభ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భారత జోడో యాత్రలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం ప్రకటించాడు.. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని అప్పుడే వెల్లడించారు.. అందులో భాగంగానే.. దేశంలోనే మొట్ట మొదట తెలంగాణలో కులగణన చేశామని వి. హన్మంతరావు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ వల్లనే “కులగణన” సాకారం కాబోతుంది.. రాహుల్ గాంధీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపడం, తదుపరి కార్యాచరణ ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నేతలు, ప్రజా ప్రతినిధులు సమావేశమయ్యాం అని ఆయన పేర్కొన్నారు. రాహల్ గాంధీ డిమాండ్, ఒత్తిడి వల్లనే కేంద్ర ప్రభుత్వం కూడా దేశ వ్యాప్తంగా “కుల గణన” కు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో కులగణన తప్పుల తడక అని బీజేపీ ఎంపీ ఆర్. కృష్ణయ్య విమర్శించారు. అన్ని ఇళ్లకు వెళ్లకుండా కులగణన చేశారని, ప్రభుత్వం తూతూ మంత్రంగా కులగణన చేసిందని మండిపడ్డారు. కులగణనలో బీసీల సంఖ్యను తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళితే ఒప్పుకోమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పినకు అసెంబ్లీలో చట్టం చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. Also Read: Road Accident: జబల్‌పుర్ రోడ్డు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. సహాయక…
దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాంగ్ డైరెక్షన్‌లో పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కులగణనఫై మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు. మొన్నటి సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు ఫామ్‌లు పంపుతున్నామని ఎద్దేవా చేశారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోండన్నారు. బీసీలకు న్యాయం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి…
తెలంగాణ సామాజిక, ఆర్ధిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే-2024 నివేదికను చట్ట సభల్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షం బీఆర్ఎస్ వైఖరి చర్చనీయాంశమైంది. ఆ పార్టీ వైఖకి అసెంబ్లీలో ఒకలా, శాసన మండలిలో మరోలా ఉండటం ఏంటో అర్ధంకావడం లేదంటున్నారు పొలిటికల్ పండిట్స్.
కులగణన సర్వే-2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు.
కుల సంఘాలను సర్వేలో పాల్గొనాలి అని చెప్పిన పాల్గొనలేదు.. ఈ సర్వేలో కావాలనే కొంత మంది పాల్గొన లేదు అని ఆయన వెల్లడించారు. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశాం.. ఇక, ఎస్సీ వర్గీకరణపై సాయంత్రం 7గంటలకు మరోసారి సమావేశం అవుతాము.. కుల గణన సర్వేకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా కుల, జన గణన చేస్తామని ప్రభుత్వం చెబుతుంది.. కుల గణనకు విరుద్ధంగా ప్రశ్నావళి ఉందని డీకే అరుణ ఆరోపించారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అని అడుగుతున్నారు.. వ్యక్తిగత ఆస్తుల వివరాలు ప్రభుత్వానికి ఎందుకని ప్రశ్నించారు.