OG Sequel: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా అవతరించింది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓజీ’ సినిమా. ‘దే కాల్ హిమ్ ఓజీ’ అనే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాని సుజిత్ డైరెక్షన్‌లో రూపొందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. నిజానికి సినిమా టాక్ పరంగా అద్భుతం అని ఎవరూ అనలేదు కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఫుల్ ఫీస్ట్ లాగా అనిపించింది.
READ MORE: Star Brothers : టాలీవుడ్ మార్కెట్‌పై కోలీవుడ్ బ్రదర్స్ స్ట్రాంగ్ ఫోకస్
చాలాకాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ని ఎలా చూడాలనుకుంటున్నామో, అలా చూసేశారు అభిమానులు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఖుషి అయిపోయి, ఈ సినిమా సీక్వెల్ లేదా ప్రీక్వెల్ చేసే ఆలోచన ఉంటే ప్లాన్ చేసుకోమని సుజిత్‌కి ఏకంగా సభాముఖంగానే చెప్పేశాడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఆ సినిమా ఉంటుందా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు, ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టేందుకు సుజిత్ సిద్ధమయ్యాడు.
READ MORE: Shilpa Shirodkar: ‘జటాధర’తో టాలీవుడ్ రీఎంట్రీ.. నేను ఇంతకు ముందు చేయలేదు!
ఎవరైతే ఓజీ సినిమాకి పని చేశారో, రైటర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు సహా డైరెక్షన్ టీమ్ మొత్తాన్ని మళ్లీ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఓజీ సీక్వెల్‌కి కథ, స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం సుజిత్ నాని సినిమా చేస్తున్నాడు. నాని సినిమా షూట్ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, ఆ వెంటనే పట్టాలెక్కించేలా ఓజీ సీక్వెల్ మీద పనిచేస్తుంది సుజిత్ టీమ్. నాని సినిమాకి వేరే టీమ్‌తో పనిచేస్తూ, ఓజీ సినిమాకి పనిచేసిన టీమ్ మొత్తాన్ని ఇప్పుడు ఓజీ సీక్వెల్ మీద సుజిత్ కూర్చోబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే, ఈ సీక్వెల్ నీడీవీవీ దానయ్య నిర్మించే అవకాశాలు తక్కువే. సుజిత్, నాని సినిమా చేస్తున్న వెంకట్ బోయినపల్లి, తదుపరి పవన్ కళ్యాణ్ సినిమా చేస్తారేమో అని అంచనాలు కూడా ఉన్నాయి. అయితే, పవన్ డేట్స్ ఇప్పటికే పలువురు నిర్మాతలకు ఇచ్చిన నేపథ్యంలో, పవన్ సూచన మేరకు నిర్మాత ఎవరవుతారనేది వేచి చూడాలి.