అడిలైడ్‌లో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే.. తొలిరోజు స్వింగ్ అవుతున్న పింక్ బాల్ ముందు మార్నస్ లబుషేన్, నాథన్ మెక్‌స్వీనీల అద్భుతంగా ఆడటంతోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరే ఆసీస్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించారని తెలిపాడు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.